అదేంటి ..... ప్రగతి కి బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కలేదా....?

తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన మా ఛానల్ లో ప్రసారమయ్యే "బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో" మొదలు పెట్టిన అనతి కాలంలోనే బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.

దీంతో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని 5 వ సీజన్ వైపు అడుగులు వేస్తోంది.

అయితే గత ఏడాది కోవిడ్ సమయంలో కూడా బిగ్ బాస్ షో ని షో నిర్వాహకులు అతి జాగ్రత్తల నడుమ నిర్వహించారు.కానీ 4వ సీజన్లో సినీ పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో చాలా చప్పగా సాగింది.

దీంతో 5 వ సీజన్ పై ఆసక్తి బాగానే నెలకొంది.కాగా ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల రేసులో టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ప్రముఖ కమెడియన్ మరియు హీరో అలీ, యూట్యూబ్ యాంకర్ శివ మరియు ప్రముఖ వార్తా ఛానల్ టీవీ9 ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసినటువంటి ఓ లేడీ యాంకర్ కి బెర్తులు ఖరారు అయినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ల రేసులో నుంచి తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి ప్రగతి పేరుని తొలగించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.అంతేకాకుండా ఇప్పటికే నటి సురేఖ వాణి మరియు మరో సీరియల్ నటి ని తీసుకోవడంతో ప్రగతికి చోటు దక్కలేదని కొందరు చర్చించుకుంటున్నారు.

Advertisement
Is Pragathi Name Is Removing From Bigg Boss Season 5 Contestants List, Bigg Boss

దీనికితోడు ఇప్పటివరకు షో నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంతమేర సందిగ్దత నెలకొంది.కానీ కొందరు ప్రగతి అభిమానులు మాత్రం ఖచ్చితంగా ప్రగతిని బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ షో నిర్వాహకులకు విన్నపాలు చేస్తున్నారు.

మరి నటి ప్రగతి అభిమానుల విన్నపాలను షో నిర్వాహకులు ఆలకిస్తారో లేదో చూడాలి.

Is Pragathi Name Is Removing From Bigg Boss Season 5 Contestants List, Bigg Boss

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రగతి 150కి పైగా తెలుగు చిత్రాలలో అక్క, అమ్మ, చెల్లి, వదిన, తదితర క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది.అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలను మరియు జిమ్ వర్కవుట్ చేస్తున్న వీడియోలను షేర్ చేయడంతో బాగానే పాపులర్ అయ్యింది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు