పెద్దిరెడ్డి ఇరుక్కుపోయారా ? అరెస్ట్ తప్పుదా ? 

గత వైసిపి( YCP ) ప్రభుత్వంలో జగన్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy )కి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి.

గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిడిపి కీలక నేతలను టార్గెట్ చేసుకుని వ్యవహరించిన తీరు,  అనేకమంది నేతలపై కేసులు నమోదు చేయించి అరెస్ట చేయించడం , అలాగే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ( Kuppam Constituency )టిడిపి ఉనికి లేకుండా చేసేందుకు ప్రయత్నించడం తదితర పరిణామాలతో తెలుగుదేశం పార్టీ హిట్ లిస్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరిపోయారు.

గత వైసిపి ప్రభుత్వం లో టిడిపిలో బలంగా వాయిస్ వినిపించే నేతలందరినీ టార్గెట్ చేసుకుని అరెస్టులు చేయించడం,  ప్రస్తుత ఏపీ మంత్రులు అచ్చెన్న నాయుడు, కొల్లు రవీంద్ర , దూళిపాళ్ల నరేంద్ర,  బీసీ జనార్దన్ రెడ్డి వంటి వారితో పాటు,  టిడిపి అధినేత చంద్రబాబు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు పాటు ఉంచడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.దీంతో వైసీపీని దెబ్బ కొట్టేందుకు ఇప్పుడు టిడిపి వ్యూహాలు రచిస్తోంది.

దీనిలో భాగంగానే ఆ పార్టీలోని కీలక నాయకులందరినీ టార్గెట్ చేసుకుంది.

ఆ లిస్టులో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు.పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.చంద్రబాబుకు( Chandrababu ) ప్రధాన శత్రువు.

Advertisement

వీరికి దశాబ్దాకాలం నుంచి రాజకీయ వైరం ఉంది.గతంలో ఎప్పుడూ ఈ విధంగా రాజకీయ కక్షలకు దిగకపోయినప్పటికీ , ఈసారి మాత్రం పెద్దిరెడ్డి అక్రమాలను బయటకు తీసి , ఆయనను జైలుకు పంపడమే లక్ష్యంగా టిడిపి ఓటమి ప్రభుత్వం ఉంది.

  అందుకే మొదటగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకున్నారట.ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అనేక అక్రమాలు పై విచారణలు కొనసాగుతున్నాయి.

  త్వరలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

 ఇటీవలే మదనపల్లి సబ్ కలెక్టర్ ( Madanapalli Sub Collector )కార్యాలయంలో మంటలు చెలరేగి కీలక కంప్యూటర్లు,  ముఖ్యమైన ఫైళ్లు దగ్ధం అయ్యాయి.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్డిఓ హరిప్రసాద్ తో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు.కాల్ డేటా పైన ఆరా తీశారు .చుక్కల భూములు,  22 ఏ ల్యాండ్స్ రిజర్వాయర్లకు సంబంధించిన భూములు,  అసైన్మెంట్ ల్యాండ్స్ కి సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే విషయం పైన ఆరా తీశారు.మదనపల్లి ఫైళ్ళ దగ్ధం కేసులు,  ముగ్గురిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఈ కేసులో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు .ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Advertisement

తాజా వార్తలు