ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడపడంతో పాటు నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.

ఇటీవలే రెండు సినిమాలతో సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు మరిన్ని సినిమాలోని లైన్ లో పెట్టారు ప్రభాస్.

అంతేకాకుండా ఇండియన్ నెంబర్ 1 స్టార్ గా అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న హీరోగా ప్రభాస్ ఉన్నాడు.ప్రభాస్ ఒకే అంటే 300 నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

ఆయన నుంచి వచ్సిన డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ కూడా వరల్డ్ వైడ్ గా 450 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.దీనిని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటనేది చెప్పవచ్చు.ఇక గత 12 నెలల్లో ప్రభాస్ నుంచి రెండు పాన్ ఇండియా సూపర్ హిట్స్ వచ్చాయి.2023 డిసెంబర్ లో వచ్చిన సలార్ 700 కోట్ల కలెక్షన్స్ ని అందుకోగా 2024 జులైలో కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD )తో 1150 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమాల నాన్ థీయాట్రికల్ బిజినెస్ లతో కలుపుకొంటే 2000+ కోట్ల కలెక్షన్స్ ని రెండు సినిమాలతో ప్రభాస్ సాధించాడు.ఇండియన్ నెంబర్ వన్ యాక్టర్ అయిన కూడా ప్రభాస్ ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.సినిమా సినిమాకి కంటెంట్, జోనర్ పరంగా ప్రభాస్ వేరియేషన్ చూపిస్తూ వెళ్తున్నాడు.

ఇలా చేయడం వలన డిస్టిబ్యూటర్స్, బయ్యర్లు, థియేటర్స్ యజమానులుకి ప్రభాస్ సినిమాలతో కొంత హాప్ దొరుకుతుంది.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉంటుందో అందరికి తెలిసిందే.

టైర్ 1 హీరోలలో ప్రభాస్ మాత్రమే బాక్సాఫీస్ ని కొంత సేఫ్ గా నడిచేలా చేస్తున్నాడనేది సినీ విశ్లేషకుల మాట.అలాగే టైర్ 2 హీరోలలో థియేటర్ ఓనర్స్ కి నమ్మకం ఇస్తున్న నటుడు అంటే నేచురల్ స్టార్ నాని అనే మాట వినిపిస్తోంది.నాని కూడా ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీస్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాడు.అలాగే విభిన్న కథలతో మూవీస్ చేస్తూ ఆడియన్స్ కి కొత్త అనుభూతి అందిస్తున్నాడు./br>

కేవలం రూ.120తో బతుకుతున్న జపనీస్ మహిళ.. పొదుపుతో మూడు ఇళ్లు కొనేసింది..?
ఈ ఇద్దరు అనవసరం తొందరపడి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారా..?

గత ఏడాది నాని నుంచి వచ్చిన దసరా, హాయ్ నా( Hi Nanna Movie )న్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఈ రెండు కూడా డిఫరెంట్ జోనర్ చిత్రాలు కావడం విశేషం.నాని సినిమా వస్తుందంటే ఓ మూడు వారాలు ప్రశాంతంగా ఉండొచ్చనే అభిప్రాయం థియేటర్స్ యజమానుల్లో ఉంది.

Advertisement

నానికి మినిమమ్ 40 కోట్ల నుంచి మేగ్జిమమ్ 100 కోట్ల వరకు మార్కెట్ ఉంది.టైర్ 2 హీరోలలో 100 కోట్లు రిపీటెడ్ గా అందుకునే సత్తా ఉన్న నటుడు అంటే నాని పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.

గత కొన్నేళ్లుగా నాని నుంచి పెద్దగా డిజాస్టర్ లు రాలేదు.కమర్షియల్ ఫ్లాప్ అయిన బాక్సాఫీస్ పరంగా డ్యామేజ్ అయితే ఏ సినిమా చేయలేదు.అందుకే ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ కి టైర్ 1 హీరోలలో ప్రభాస్, టైర్ 2 హీరోలలో నాచురల్ స్టార్ నాని నిర్మాతల నుంచి థియేటర్స్ యజమానులు వరకు అందరికి సేఫ్ హ్యాండ్స్ గా మారారని చెప్పవచ్చు.

అభిమానులు కూడా ఈ విషయాలలో ప్రభాస్ అలాగే నానీలు గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు