ఇంతకు ఆమెతో చైతూ రిలేషన్ లో ఉన్నట్లా? లేనట్లా? ఆ సాక్ష్యాలకు వీరి సమాధానం ఏంటో?

నాలుగు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య మరియు సమంత చాలా తక్కువ సమయానికే విడి పోయారు.

ఇద్దరు విడాకులు తీసుకుని, అధికారికంగా ఎవరి దారి వారు చూసుకున్నారు.

విడాకుల తర్వాత నాగ చైతన్య కెరీర్ లో బిజీ అవ్వగా.సమంత కాస్త వెనుకబడిపోతుందని అంతా భావించారు.

కానీ ఆమె కెరియర్ మరింత స్పీడ్ గా దూసుకు పోతుంది.సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత మరో పెళ్లి విషయం లో ఆసక్తి కనబర్చుతున్నట్లుగా లేదు.

అయితే నాగ చైతన్య( Naga Chaitanya ) మాత్రం కొత్త రిలేషన్షిప్ మొదలు పెట్టాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఆ విషయమై కొన్ని సాక్షాధారాలు కూడా వెలుగు చూశాయి.

Advertisement

ఇటీవల లండన్ లో నాగచైతన్య ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన సమయంలో అక్కడికి స్టాఫ్ తో చైతూ ఫోటో దిగారు.

ఆ ఫోటోలో శోభిత ధూళిపాల( Shobita Dhulipalla ) ఉండడంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని పుకార్లకు బలం చేకూరినట్లు అయిందని ప్రచారం జరుగుతుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా నాగ చైతన్య త్వరలోనే తన రిలేషన్షిప్ గురించి అధికారికంగా బయటపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో కొందరు మాట్లాడుకుంటున్నారు.అక్కినేని ఫ్యామిలీ లో( Akkineni Family ) విడాకులు మరియు రెండవ పెళ్లి కొత్తేం కాదు.

కనుక నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడం ఎవరు అడ్డు చెప్పరు.అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.తాము రిలేషన్ లో ఉన్నాం అని చెప్పేందుకు వారు ఆసక్తి చూపించడం లేదు.

ఇటీవల శోభిత దూళిపాల మీడియా తో మాట్లాడుతూ పుకార్లకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అదే సమయం లో తాను ప్రేమ లో పడితే తప్పకుండా అందరికీ చెప్తానని కూడా పేర్కొంది.ఆమె మాటలను బట్టి ప్రేమలో పడలేదని అనిపిస్తుంది.ఈ ఫోటో ఏంటి అనేది మాత్రం వినండి సమాధానం రావాల్సి ఉంది.

Advertisement

స్నేహం కారణంగా లండన్ వరకు వెళ్లిందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు వీరి రిలేషన్‌ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం నాగచైతన్య ప్రియురాలి హోదాలో మాత్రమే ఆమె వెళ్లి ఉంటుంది అంటూ చర్చించుకుంటున్నారు.మొత్తానికి నాగచైతన్య ఆమెతో రిలేషన్ లో ఉన్నాడా లేదా అనే విషయాన్ని క్లారిటీ రావాల్సి ఉంది.

మరో వైపు నాగచైతన్య కస్టడీ సినిమాతో ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

తాజా వార్తలు