ముద్రగడ పవన్ ప్రభావాన్ని తగ్గించగలరా ??

జనసేన- తెలుగుదేశం( Janasena- Telugu Desam ) పొత్తు తమకు ఇబ్బందికరంగా మారుతుంది అని భావిస్తున్న వైసిపి పార్టీ దానికి విరుగుడు మంత్రంగా కాపు సామాజిక వర్గ నాయకుడు .

మొదటి నుండి కాపు ల రిసర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తున్న ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) ను ప్రయోగించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .

ఆ దిశగా ఇప్పటికే తుని రైలు కేసుల నుంచి ముద్రగడ పద్మనాభం కు విముక్తి కలిగించిన అధికార పార్టీ ఆయనను వచ్చే ఎన్నికలలో కీ రోలు పోషించేలా ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తుంది .

తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో వైసిపి ( YCP )నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించినట్టు తెలుస్తుంది .ఈనెల 14 నుంచి వారహి యాత్ర ప్రారంభించాలని పవన్ భావించడంతో రాజకీయంగా జనసేనకు మైలేజ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికార పార్టీ నేతలు ఆ ప్రభావం తగ్గించే దిశగా ముద్రగడ పద్మనాభం ను తీసుకువచ్చారు.పవన్ కళ్యాణ్ వారాహి నియోజకవర్గాలు( Warahi Constituencies ) ఎక్కువగా కాపు సామాజిక వర్గ పట్టు ఉన్న నియోజకవర్గాలలోనే రూట్ మ్యాప్ ఫిక్స్ అయింది.

పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ ,ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, పాలకొల్లు, నర్సాపురం భీమవరం ఇలా కాపు సామాజిక వర్గం ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్న స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న జనసేన వేగంగా పావులు కలుగుతుంది .

Advertisement

అయితే ఈ స్థానాల్లో 2019లో జెండా ఎగరేసిన వైసిపికి ఈ పర్యటన రాజకీయంగా ఇబ్బందిగా కరంగా మారే అవకాశం ఉండడంతో పవన్ ( Pawan )ప్రభావాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.వైసిపి నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కూడా సూచనప్రాయంగా అంగీకరించారు.ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లా మొత్తం నుంచి ఉంటుందని భావిస్తున్న వైసిపి అధిష్టానం ఆయనకు ఆయన అనునయులకు కూడా టికెట్లు ఇచ్చి ఆ సామాజిక వర్గం నుంచి బలమైన షేర్ ని తమ వైపు లాక్కోవాలననే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది .మరి పవన్ చరిష్మ ని దాటి ముద్రగడ ఓటు బ్యాంకు తీసుకు రాగలరో లేదో రానున్న రోజుల్లో ఒక అంచనాకొచ్చే అవకాశం ఉంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు