గులాబీ బాస్.. ఫిక్స్ అయ్యారా ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోలిటికల్ హిట్ పెరుగుతోంది.

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party )కి ఈసారి ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

ఎందుకంటే వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బి‌ఆర్‌ఎస్.ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావిస్తోంది.

అయితే ఈసారి బి‌ఆర్‌ఎస్ కు గెలుపు అంతా తేలికైన విషయం కాదు.ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ( BJP party ) కూడా ఈసారి బలం పెంచుకున్నాయి.

ఆరెండు పార్టీలు కూడా విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ లలో జరిగిన బైపోల్ లో బీజేపీ సత్తా చాటింది.

Is Kcr Fixed Like That, Cm Kcr, Brs Party, Congress Party, Bjp Party, Brs Mlas
Advertisement
Is KCR Fixed Like That, CM Kcr, BRS Party, Congress Party, BJP Party, BRS MLAS-�

అటు కాంగ్రెస్ కూడా మెజారిటీ స్థానాలలో పుంజుకుంది.దాంతో ఈ రెండు పార్టీల పోటీని దాటుకుని బి‌ఆర్‌ఎస్ విజయపథంలో నడవడం కష్టమేనేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు.అందుకే అధినేత కే‌సి‌ఆర్ ( CM KCR )కూడా ఈసారి పక్కా ప్రణాళిక బద్దంగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారట.

అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ గులాబీ బాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంత మంది అవినీతికి పాల్పడుతున్నారని, కే‌సి‌ఆర్ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.

Is Kcr Fixed Like That, Cm Kcr, Brs Party, Congress Party, Bjp Party, Brs Mlas

తీరు మార్చుకోక పోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదంటూ తేల్చి చెప్పారు కూడా.ఇక ఇప్పటికే నియోజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన గులాబీ బాస్.సర్వేలో ప్రజా వ్యతిరేకత ఉన్న వారిని నిరభ్యంతరంగా పక్కన పెట్టి.

కొత్తవారిని తీసుకునేందుకు సిద్దమౌయితున్నారని టాక్.ఇప్పటికే అభ్యర్థుల విషయంలో మొదటి లిస్ట్ ను కూడా రెడీ చేశారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక ఆగష్టు రెండో వారంలో లేదా మూడో వారంలో అభ్యర్థుల ప్రకటన ఉనబోతుందని టాక్.అందుకే సిట్టింగ్ ఎమ్మేల్యేలు సీటు దక్కుతుందా లేదా అనే దానిపై కాస్త అయోమయంలో ఉన్నారట.

Advertisement

మొదటి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తే.నేతలు కూడా ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది.

అందుకే గులాబీ బాస్ వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రకటన విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి సీటు దక్కించుకునే అభ్యర్థులెవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు