వసంత పంచమి రోజు ఈ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం?

హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి నెలా ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటారు.

ఈ విధంగా మాఘ మాసంలో కూడా ఎన్నో ప్రత్యేకమైన రోజులను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఇలా మాఘమాసంలో శుక్లపక్షంలో 5వ రోజున ప్రతి ఏడాది ఘనంగా వసంత పంచమిని జరుపుకుంటారు.ఇలా వసంత పంచమి రోజుపెద్ద ఎత్తున సరస్వతీదేవిని పూజిస్తూ అమ్మవారి కరుణాకటాక్షాలు తమ పిల్లలపై ఉండాలని భావిస్తారు.

ఇలా వసంత పంచమి రోజు అమ్మవారిని పూజించే సమయంలో ఎలాంటి దుస్తులను ధరించి పూజ చేయాలి అనే విషయానికి వస్తే.వసంత పంచమి రోజు ప్రకృతితో ఐక్యం కావడం కోసం ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తులను ధరించాలని పండితులు చెబుతున్నారు.

ఇలా పసుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం.పసుపు శుభానికి సంకేతం కనుక ఇలాంటి రంగు దుస్తులను ధరించాలని పండితులు చెబుతున్నారు.

Advertisement

పురాణాల ప్రకారం వసంత పంచమి రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు.

ఇలా విశ్వాన్ని సృష్టించినప్పుడు ఎరుపు, నీలం పసుపు రంగులు కనిపించాయని వాటిలో ముందుగా పసుపు రంగు కనిపించిందని పండితులు చెబుతున్నారు.అందుకే ఈ వసంత పంచమి రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదమని భావిస్తారు.వసంత పంచమి నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి పుడమిపై ఎక్కడ చూసినా పసుపుపచ్చగా కనిపిస్తుంది కనుక ఆ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభకరం ఇలా పసుపు రంగు దుస్తులను ధరించడం వల్ల నాడీ వ్యవస్థ, మెదడు కూడా చురుకుగా పనిచేస్తాయి.

Advertisement

తాజా వార్తలు