మంచినీళ్ళు నిల్చోని తాగితే మంచిదా లేక కూర్చోని తాగితే మంచిదా?

మామూలుగానైతే మంచినీళ్ళు నిల్చోనే తాగేస్తారు జనాలు.కాని ముస్లిములు చాలావరకు కూర్చోనే నీళ్ళు సేవిస్తారు.

అలా ఎందుకు తాగుతారు, నిలబడే తాగవచ్చు కదా అని తెలియనివారు, ఎవరైనా అడిగితే, చాలామంది అది మత ఆచారం అని చెబుతారు.కొంతమందే అలా తాగితేనే ఆరోగ్యం అని సింపుల్ గా చెప్పేస్తారు.

కాని లాజిక్ చెప్పరు.ఇలా మత ఆచారం అని చెప్పడం వలన, ఎలా ఆరోగ్యకరమో చెప్పకపోవడం వలన, ఈ మంచి అలవాటుని ఫాలో అవడానికి ముస్లీములు కానివారు పెద్దగా ఆసక్తి చూపించరు.

సరే, ఇప్పడు ఇదంతా ఎందుకు కాని, నీరు నిల్చోని ఎందుకు తాగకూడదో, కూర్చోని ఎందుకు తాగాలో చూడండి.మనం నిల్చోని నీళ్లు తాగుతున్నాం అనుకోండి, అప్పుడు నీళ్ళు ఒక్కసారిగా ఆహార నళం నుంచి జీర్ణాశయంలోకి వెళతాయి.

Advertisement
Is It Better To Drink Water By Sitting Down Why Details, Drinking Water, Sitting

అంటే, ఓ ఎత్తులోంచి నీళ్ళు కింద ఎలా చిమ్మినట్లు పడతాయో, అలానే మన జీర్ణాశయంలోకి చిమ్మినట్లు పడతాయన్నమాట.జీర్ణాశయం గోడలపై ఈ ప్రెషర్ వలన అజీర్ణ సమస్యలు వస్తాయి.

అదే కూర్చోని నీళ్ళు తాగితే, నీళ్ళు కాస్త మెల్లిగా జీర్ణాశయంలోకి చేరతాయి.

Is It Better To Drink Water By Sitting Down Why Details, Drinking Water, Sitting

కూర్చోని నీళ్ళు తాగితే కడుపులో అమ్లాల ప్రభావం తగ్గుతుంది.అదే నిల్చోని తాగితే నీరు డైరెక్టుగా జీర్ణాశయం కింది భాగంలోకి వెళతాయి.దాంతో సరిగా జీర్ణం కాకపోవడం, త్వరగా జీర్ణం కాకపోవడం జరగవచ్చు.

కూర్చోని నీళ్ళు తాగితే నాడీవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుందట.కొన్ని పరిశోధనలను బట్టి చూస్తే, నిల్చోని నీరు తాగితే, మన కిడ్నిల దాకా నీళ్ళు సరిగా చేరవట.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?

అదే కూర్చోని తాగితే కిడ్నిలకి నీరు బాగా అందుతాయని, తద్వారా కిడ్నీ సమస్యలు, మూత్రాశయం సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతారు ఆరోగ్య నిపుణులు.కాబట్టి, కూర్చొని నీళ్ళు తాగేందుకు ప్రయత్నించండి.

Advertisement

ఇలా తాగడం ఓ మత ఆచారం మాత్రమే కాదు, ఒక ఆరోగ్యకరమైన అలవాటు అని అడిగినవారికి చెప్పండి.

తాజా వార్తలు