ప్రశాంత్ వర్మ తన కథలను వేరేవాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ( Prashant Verma ) లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను అలారించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి.

ఇక ఇప్పటికే ఆయన జై హనుమాన్ సినిమాతో( Jai Hanuman ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపధ్యంలో రీసెంట్ గా ఆయన చేసిన దేవకి నందన వసుదేవ అనే సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

మరి ప్రశాంత్ వర్మ లాంటి ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఇలాంటి ఒక కథను రాసి ఎందుకు వేరే వాళ్ల చేత డైరెక్షన్ చేయించాడు.దానివల్ల అతనికున్న గుడ్ నేమ్ అయితే పోయే అవకాశాలు ఉన్నాయి కదా! అంటూ కొంతమంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక మొన్నటిదాకా ప్రశాంత్ వర్మ అంటే చాలా సెన్సిబుల్ డైరెక్టర్( sensible director ) అలాగే ఆయన నుంచి వచ్చే కథలు చాలా బలంగా ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతూ ఉండేవారు.

కానీ ఇలాంటి ఒక నాసిరకం కథను చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ కూడా రొటీన్ రొట్ట కథలు రాస్తున్నాడా అనే అనుమానాలు అయితే కలగక మానవు.మరి ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్ వర్మ ఇకమీదట కథలను ఇవ్వకుండా తను మాత్రమే డైరెక్షన్ చేసుకుంటూ ముందుకు సాగితే మంచిది.లేకపోతే మాత్రం ఇలాంటి నాసిరపు రకపు కథలతో ఆయన పేరు భారీగా చెడిపోయే ప్రమాదం అయితే ఉంది.

Advertisement

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రశాంత్ వర్మ తన డైరెక్షన్ లో చేస్తున్న జై హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని కోరుకుందాం.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
Advertisement

తాజా వార్తలు