ఏపీలో అందరి టార్గెట్ అతడే ?

ఏపీ రాజకీయాలు( AP Politics ) వేడెక్కాయి.విపక్ష పార్టీలన్నీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలి అనే లక్ష్యంతో బిజెపి, జనసేన, టిడిపిలు ( BJP, Jana Sena, TDP )వ్యూహాలు  పన్నుతున్నాయి.అవసరమైతే మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని అయినా, జగన్( jagan ) ముఖ్యమంత్రి కాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే పొత్తుల విషయంలో విపక్షాల మధ్య సరైన క్లారిటీ లేదు.మొన్నటి వరకు టిడిపి తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చూస్తానని,  ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ తనకు ఆశ లేదని, అంత బలం కూడా లేదు అంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం పొత్తుల విషయం ఎన్నికల సమయంలో ప్రకటిస్తానని, తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ ప్రకటనలు చేస్తున్నారు.

ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ పొత్తుల విషయంలో పూర్తిగా సైలెంట్ గా ఉంది.ఒకవైపు బిజెపితో వ్యవహారంపై చర్చిస్తూనే , మరోవైపు జనసేనతోను టచ్ లో ఉంది.సరైన సమయంలో పొత్తులు వ్యవహారంపై స్పందించాలనే ఆలోచనతో టిడిపి ఉంది.

Advertisement

ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా, కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లినా, వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే ఈ మూడు ప్రధాన పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ మూడు పార్టీలు వైసిపిని లక్ష్యంగా చేసుకొని అనేక విమర్శలు,  ఆందోళనలు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

అలాగే జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి, టీడీపీ, జనసేనలు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు.ఒంటరిగా వెళ్తే ఫలితం ఏవిధంగా ఉంటుందనేది ఈ మూడు పార్టీలకు బాగా తెలుసు.అయితే పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

కానీ ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు లేవు అంటూనే , రహస్య అవగాహనతో పని చేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.దీంతో  ఎన్నికలు రాకముందే ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు