పాప్‌కార్న్‌ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనమా.. హానికరమా..!

సాధారణంగా చాలా మంది ప్రజలు మొక్కజొన్నతో తయారు చేసిన పాప్‌కార్న్‌( Popcorn ) ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలు ఎక్కువగా దీన్ని తింటూ ఉంటారు.

అంతే కాకుండా సినిమాలకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు పాప్‌కార్న్‌ ను తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే కొంత మందికి వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అనుమానం ఉంది.

అలాంటి వారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.పాప్‌కార్న్‌ లో ఫైబర్( Fiber ), యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బి కాంప్లెక్స్( Vitamin B complex ), మెగ్నీషియం లాంటి ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి.

ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.అంతే కాకుండా పాప్‌కార్న్‌ తినడం వల్ల మలబద్ధకం, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Advertisement

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి ప్రమాదకరమైన క్యాన్సర్లను నిరోధిస్తాయి.అంతే కాకుండా అధిక బరువుతో బాధపడేవారు పాప్‌కార్న్‌ తింటే త్వరగా బరువు తగ్గుతారు.ఇంకా చెప్పాలంటే వీటిని ఎక్కువగా తింటే వయసు పెరగడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు, మచ్చలు, కండరాల బలహీనత, జుట్టు రాలడం వంటివి త్వరగా ఈ లక్షణాలు కనిపించకుండా ఉంటాయి.

అంతే కాకుండా పాప్‌ కార్న్‌ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే నెయ్యి, ఉప్పు ఎక్కువగా ఉన్నా పాప్‌ కార్న్‌ ను తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి ఇలాంటి పాప్‌ కార్న్‌ కు కాస్త దూరంగా ఉండటమే మంచిది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు