బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీకి నిర్మాత మారారా.. దిల్ రాజు అంత ధైర్యం చేస్తారా?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల పుష్ప 2(Puspha 2) మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వం(Directed by Sukumar) వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యే సూపర్ హిట్ గా నిలిచింది.

అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్.

ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎటువంటి సినిమాలలో నటిస్తారు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అల్లు అర్జున్ తదిపరి సినిమా పైనే అందరి చూపు ఉంది.

ఇప్పటికే ఈ విషయంపై చాలా రకాల కథనాలు కూడా వినిపించాయి.

Advertisement

ఇప్పటికే అట్లీ, త్రివిక్రమ్(Atlee, Trivikram), కొంతమంది డైరెక్టర్ ల పేర్లు కూడా వినిపించాయి.వీటిలో ముందుగా అట్లీ సినిమా స్టార్ట్ చేస్తాడని, ఆ తర్వాత కొన్ని రోజులకు త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్ట బోతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు మరో వార్త మొదలైంది.

అదేమిటంటే ఈ రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టును నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారట.బన్నీ అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయాలి.

కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి సదరు సంస్థ తప్పుకున్నట్టు, అందులోకి దిల్ రాజు ఎంటర్ అయినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.కానీ కొంతమంది ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు ఉన్న పరిస్థితుల్లో అంత ధైర్యం చేస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

మొన్ననే గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.తను ఆ సినిమా ఫలితాన్ని ఇప్పటికిప్పుడు విశ్లేషించనని, ఏడాది చివర్లో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటానని ఆయన పైకి చెబుతున్నప్పటికీ, ఆర్థికంగా అతడ్ని చాలా ఇబ్బందిపెట్టింది గేమ్ ఛేంజర్ మూవీ.

Advertisement

కాబట్టి ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ సినిమాను నిర్మించడం సాధ్యమయ్యే పని కాదని దానికి తోడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోట్లతో కూడుకున్నది అని తెలుస్తోంది.

తాజా వార్తలు