లోకేష్ ప్రత్యర్థిని మార్చేస్తున్నారా ? 

మరికొద్ది నెలలో జరగబోతున్న ఏపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి .

ఇప్పటికే గెలుపు కోసం వైసిపి, టిడిపి, బిజెపి , జనసేన పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ప్రజ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.ఇక ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాల పైన జనాల్లో ఆసక్తి పెరుగుతుంది.  ముఖ్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది.2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందారు.2024 ఎన్నికల్లోను మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించి తన సత్తా చాటుకుంటానని లోకేష్( Nara lokesh ) ఇప్పటికే సవాల్ చేశారు.దీంతో లోకేష్ కు ప్రత్యేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉంటారా లేక మరొకరిని పోటీకి దింపుతారా అనేది తేలాల్సి ఉంది.

అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని అనేక సర్వేల ద్వారా వైసిపి అధిష్టానం గుర్తించిందట.

దీంతో పాటు ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో,  ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దించితే గెలుపునకు డోకా ఉండదని లెక్కలు వేసుకుంటోంది.అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) ఆర్థికంగా , సామాజికంగా బలమైన నేత అయినా ఆయనను మార్చాలని జగన్ నిర్ణయించుకున్నారట.దీంతో టిడిపి నుంచి వైసీపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల పేర్లను వైసిపి అధిష్టానం పరిశీలిస్తోంది.

Advertisement

మంగళగిరిలో చేనేత వర్గాలు ఎక్కువగా ఉండటంతో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం కల్పించడం ద్వారా,  లోకేష్ ఓటమి మరింత సులువు అవుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారట.అయితే టిడిపి కూడా లోకేష్ విజయం కోసం గట్టిగానే కృషి చేస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధకు( Panchumarthi Anuradha ) ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.ప్రోటోకాల్ నియోజకవర్గంగా మంగళగిరి నియోజకవర్గం ను ఆమె ఎంచుకున్నారు.పోతినేని శ్రీనివాసరావు , నందం అబద్దయ్య లను సమన్వయం చేసుకుంటూ లోకేష్ ను గెలిపించే విధంగా రంగంలోకి దిగరట.

ప్రస్తుత వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బాపట్ల అసెంబ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందట.ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కోన రఘుపతి పై స్థానికంగా అసమ్మతి నెలకొనడంతో,  ఆయన స్థానంలో రామకృష్ణారెడ్డికి అవకాశం కల్పిస్తే సులువుగా గెలుస్తారని అంచనా వేస్తున్నారట.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement

తాజా వార్తలు