టీడీపీ తో బీజేపీ అదే దూరం ? పొత్తు లేనట్టేనా ?

బిజెపికి ఎంత దగ్గరవుదామని ప్రయత్నిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఆశలు మాత్రం తీరడం లేదు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయ యాత్రలు చేస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనిచ్చేది లేదు అని, దీనికోసం విపక్ష పార్టీలన్నిటిని ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పదేపదే చెబుతున్నారు.ఇక జనసేనతో బిజెపికి పొత్తు ఉన్న నేపథ్యంలో టిడిపిని( TDP ) కూడా కలుపుకుని వెళ్లి,  మూడు పార్టీలు ఉమ్మడిగా వైసీపీని ఢీ కొట్టాలనే లక్ష్యంతో పవన్ ఉన్నారు.

ఇక ఎప్పటి నుంచో ఈ రకమైన పరిస్థితి కోసం ఎదురుచూపులు చూస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు బిజెపి అండదండలు ఉంటే వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని , మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవచ్చనే ఆలోచనతో ఉన్నారు.

అయితే బిజెపి( BJP ) అగ్ర నేతలు వైఖరి మాత్రం ఎవరికి అంతు పట్టడం లేదు .టిడిపితో పొత్తు అంశంపై ఆ పార్టీ నేతలు ఎవరు నేరుగా స్పందించడం లేదు.ఎన్నికల సమయంలోనే దీనిపై ఒక క్లారిటీ కి రావాలని బిజెపి అగ్రనేతలు భావించారు.

Advertisement

అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకే అధికారం దక్కే అవకాశం ఉండడం, మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది అనే సర్వే నివేదికలతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కంటే వైసీపీతో సఖ్యతగా మెలిగితేనే మంచిదన్న అభిప్రాయంతో బిజెపి అగ్ర నేతలు ఉన్నారట అందుకే జగన్( jagan ) ను తరచుగా ఢిల్లీకి పిలిపించుకుని చర్చిస్తున్నారు.అలాగే ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించేందుకు జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు .ఆయన కోరిన వెంటనే బిజెపి అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇస్తున్నారు .

వైసిపికి( YCP ) రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉండడం, చంద్రబాబు వైఖరి పై అనేక అనుమానాలు ఉండడం వంటివన్నీ బిజెపి టిడిపి పొత్తుకు బ్రేకులుగా  మారాయట .ప్రస్తుతం ఏపీకి సంబంధించి జగన్ ఏ సమస్యను ప్రస్తావించినా దానికి సానుకూలంగా స్పందించడం, నిధులు విడుదల చేయడం వంటి అన్ని వ్యవహారాలు చేస్తుండడం,  రాబోయే రోజుల్లో జగన్ తోనే తమకు అవసరం అన్నట్లుగా బిజెపి పెద్దలు ఉండడం , తదితర కారణాలన్నిటిని లెక్కలు లెక్కలు వేసుకుంటే టీడీపీ బీజేపీ పొత్తు కుదిరే పనికాదు అని అర్థం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు