ఫైమాకి మల్లెమాల వారి కన్నా బిగ్ బాస్ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారా?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఫైమా ఒకరు.

పటాస్ కార్యక్రమం ద్వారా పరిచయమైన ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీగా పేరు సంపాదించుకుంది.

నిరుపేద కుటుంబంలో జన్మించిన ఫైమా అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం సెలబ్రెటీ హోదా సంపాదించుకుంది.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఈమె సందడి చేయడంతో ఎంతోమంది ఈమెకు అనుకూలంగా ఈమెను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఫైమా బాగానే సంపాదిస్తుంది అలాంటిదే జబర్దస్త్ కార్యక్రమం వదిలి బిగ్ బాస్ రావడానికి గల కారణం ఏంటి అని సందేహం ప్రతి ఒక్కరిలో తలెత్తింది.

అయితే ఈమెకి జబర్దస్త్ కంటే బిగ్ బాస్ నిర్వాహకులు అధిక రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతోనే తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసినందుకుగాను ఫైమాకు ఒక్కో స్కిట్ కు లక్ష రూపాయలు వరకు రెమ్యూనరేషన్ వచ్చేది.అయితే నెల మొత్తం తనకు షూటింగ్ ఉండేది కాదని నెలలో పది రోజులపాటు వరుస షూటింగులతో పాల్గొంటూ బిజీగా ఉండేవారు అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెకు వారానికి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇలా మల్లెమాల వారి కంటే బిగ్ బాస్ నిర్వహకులు తనకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వటం వల్ల తాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిందని వార్తలు వినపడుతున్నాయి.

ఇక ఈమెకు బయట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక ఈమె ఎక్కువ వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement