అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల మీద భారీ ఫోకస్ పెడుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమా సాధించలేని కలెక్షన్స్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఒకే ఒక్క సినిమా పుష్ప 2(Puspa-2).

ప్రస్తుతం ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు సాగుతుంది.

ఇక బాహుబలి 2(Bahubali 2) రికార్డును బ్రేక్ చేసే దిశగా ముందుకు సాగుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun)ఒక భారీ సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి.ఇక తన పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి సినిమా పరంగా మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా మారబోతుందనే కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నార్త్ లో బీభత్సమైన కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.దాదాపు 600 కోట్లకు పైన కలెక్షన్లు నార్త్ నుంచే రాబట్టింది అంటే మామూలు విషయం కాదు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి రికార్డు లను క్రియేట్ చేసిన తెలుగు సినిమా ఏది లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటివరకు ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన అల్లు అర్జున్ (Allu Arjun)తన తదుపరి సినిమాల మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
Is Allu Arjun Focusing Heavily On His Next Films?, Bahubali 2, Puspha2, Allu Arj

ఇక వరుసగా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలైతే తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Is Allu Arjun Focusing Heavily On His Next Films, Bahubali 2, Puspha2, Allu Arj

ఇక ఇప్పటికే ఆయన పర్సనల్ విషయాల్లో కొన్ని కేసుల పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి తన టీం అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ (Trivikram, Sandeep Reddy Vanga)దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఆయన కమిట్ అయ్యారు.కాబట్టి రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్ లలో తెరకెక్కాయి.

మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు