ఇరాన్ సరిహద్దులో మారణ హోమం.. 11 మంది శరణార్థులు దారుణ హత్య!!

ఇరాన్( Iran ) సరిహద్దులో ఆ దేశ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు మారణ హోమం సృష్టించారు.

దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 11 మంది అఫ్గాన్‌ శరణార్థులను( Afghan Refugees ) ఇరాన్ సరిహద్దు దళాలు దారుణంగా చంపేశారు.

తరువాత ఆ అఫ్గాన్‌ శరణార్థుల డెడ్ బాడీస్‌ను నిమ్రోజ్ బోర్డర్ క్రాసింగ్ వద్ద తాలిబన్లకు అప్పాజెప్పారు.ఈ కౄరత్వాన్ని స్థానిక మీడియా నివేదించింది.

మృతులు అఫ్గాన్‌ నుంచి పారిపోయి సిస్తాన్, బలూచిస్థాన్‌లలో ఇల్లీగల్‌గా చొరబడాలని అనుకున్నారు.దురదృష్టం కొద్ది వారు ఇరాన్ భద్రతా దళాలకు చిక్కారు.

దాంతో వారిని దళాలు అక్కడికక్కడే కాల్చి చంపేశారు.మృతులలో 9 మందికి 20 ఏళ్లు, ఇద్దరికి 18 ఏళ్ల వయస్సు ఉన్నట్లు సమాచారం.ఈ దారుణంపై ఇరు దేశాల అధికారులు స్పందించలేదు.

Advertisement

ఇకపోతే నిమ్రూజ్ ప్రావిన్స్‌లో గత ఏడాది కాలంలో 470 మందికి పైగా అఫ్గాన్‌ శరణార్థుల మరణించారు.తాలిబన్లు ఈ మరణాలపై స్పందిస్తూ అనేక సంఘటనలలో వారు మరణించారని తెలిపారు.

ఇక ఇరాన్ దేశం గత వారంలో 7,612 మంది అఫ్గాన్‌ శరణార్థులను తరిమికొట్టారు.

2021లో తాలిబన్లు( Talibans ) అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న సమయం నుంచి ఆ దేశ ప్రజలు అక్కడి కఠిన రూల్స్, హింస పాటించలేక ఇరాన్, పాకిస్థాన్‌తో సహా ఇతర పొరుగు దేశాలకు తరలిపోతున్నారు.వీరందరూ అక్రమ మార్గాల ద్వారానే పొరుగు దేశాలలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలో వారు అధికారులకు చిక్కి ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కోసారి వారి చేతుల్లో హతం అవుతున్నారు.ఖమా ప్రెస్ ప్రకారం, 3,000 మంది అఫ్గాన్‌ శరణార్థులు మళ్లీ తాలిబన్ల రాజ్యానికే తిరిగి వచ్చినట్లు నివేదించింది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది, మరికొందరు తమ ఇష్టానుసారం వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు