బడ్జెట్ ధరతో మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంచ్.. దాని ధర, ఫీచర్లు ఇవే...

ఐకూ నుంచి ఇప్పటికే ఎన్నో పవర్ ఫుల్ ఫోన్లు విడుదలై హాట్ కేకుల్లా అమ్మడుపోయాయి.

ఈ కంపెనీ నుంచి నెక్స్ట్ ఫోన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మొబైల్ లవర్స్ బాగా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నియో 7 5G ఫిబ్రవరి 16న ఇండియాలో విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది.అప్పటినుంచి ఫ్యాన్స్ దీని ఫీచర్స్‌, ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.

ఈ క్రమంలోనే కంపెనీ తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లను లీక్ చేసింది.మరి ఆ వివరాలేవో ఇప్పుడు చూసేద్దాం.నియో 7 5G డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, వేడిని తగ్గించే 3D కూలింగ్ సిస్టమ్‌, 120W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీ, 6.78-అంగుళాల AMOLED FHD+ పంచ్-హోల్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అవుతుంది.2022 డిసెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఐకూ నియో 7 SEకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా iQOO Neo 7 5G వస్తుంది.

ఇందులో 12 GB వరకు LPDDR5 ర్యామ్, 512జీబీ UFS 3.1 స్టోరేజ్‌, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 64ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్‌లో సేఫ్టీ కోసం అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Advertisement

డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో ఇది దుమ్మురేపుతుంది.

ఇది దాదాపు 35,090 mm2 డిస్సిపేషన్ ఏరియా కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.ఇందులో OriginOS 3, ఆండ్రాయిడ్ 13 ఇవ్వనున్నారు.ఇండియాలో ఐకూ నియో 7 5G రూ.30,890 ధరకు అందుబాటులోకి రావొచ్చు.అఫీషియల్ లాంచ్ టైమ్‌లో మాత్రమే ఈ మొబైల్ కచ్చితమైన ధర తెలుస్తుంది.

Advertisement