ఐపీఎల్ 13 వ సీజన్ లో భాగంగా శుక్రవారం షార్జావేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ మొదటగా బ్యాటింగ్ చేసి , రాజస్దాన్ రాయల్స్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
మెుదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ అరంభంలో కాస్త తడబడింది.
ఓపెనర్స్ పృథ్వీ షా 19, శిఖర్ ధావన్ 5 ఈ మ్యాచ్ లో మంచి అరంభాన్ని ఇవ్వలేకపోయారు.ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22, రిషభ్ పంత్ 5 పరుగుల వద్ద రనౌట్ గా పెవిలియన్ బాట పట్టారు.
ఈ సమయంలో పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన ఢిల్లీని అల్ రౌండర్ స్టాయినిస్ 39,హెట్ మెయిర్ 45 పరుగులు చేసి అదుకున్నారు.చివరిలో టైలేండర్స్ కొంచెం బ్యాట్ ఝలిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.
దీనితో రాజస్థాన్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 185 పరుగులు చేయాల్సి ఉంటుంది.అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్, ఢిల్లీని బ్యాటింగ్ ను అప్పగించింది.
ఇక గత మ్యాచ్ అనుభవం నుండి పాఠాలు నేర్చుకున్న రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మార్పులు చేసింది.వరుణ్ ఆరుణ్, ఆండ్రూ టై తుది జట్టులోకి రాగా.
అంకిత్ రాజ్ పుత్, టామ్ కరన్ బెంచ్ కు పరిమితమయ్యారు.ఇక ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా అదే టీం తో బరిలోకి దిగింది.
వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది.ఐదు మ్యాచ్ లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy