ఐపీఎల్ సీజన్( IPL 2023 ) మొదలై సగానికి పైగా మ్యాచులు కూడా పూర్తయ్యాయి.
జట్లు అద్భుత ఆటను ప్రదర్శిస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు లీగ్ పాయింట్ల పట్టికలో స్థానాలు మారుతూనే ఉన్నాయి.
అయితే ఈ సీజన్ లో భారత ఆటగాళ్లతో పాటు కొందరు విదేశీ ఆటగాళ్లు కూడా అద్భుత ఆటను ప్రదర్శిస్తూ క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.తమ వంటి చేత్తో జట్టును గెలిపించడం కోసం గ్రౌండ్లో దుమ్ము లేపుతున్న విదేశీ ఆటగాళ్లలో డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, కైల్ మేయర్స్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ మారుమోగుతున్నాయి.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో వీరి ఆట ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్.ఈ సీజన్లో అద్భుత ఆటను ప్రదర్శించాడు.ఇతడు ఆడిన 9 మ్యాచ్ లలో 59.14 సగటుతో మొత్తం 414 పరుగులు చేశాడు.ఆడిన 9 మ్యాచ్ లలో ఐదు అర్థ సెంచరీలు చేశాడు.
ఓపెనర్ గా శుభారంభం అందించడంతో చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది.
గత ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్ లలో 33.88 సగటుతో 271 పరుగులు చేశాడు.ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి.
లక్నో జట్టు( LSG ) లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా శుభారంభం ప్రారంభించి కీలక పాత్ర పోషించాడు.ఆడిన 8 మ్యాచ్లలో 37.12 సగటుతో 297 పరుగులు చేశాడు.అంతేకాకుండా స్ట్రైక్ రేట్ 160.54 గా ఉంది.
ఈ ఐపీఎల్ సీజన్లో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్( Rashid Khan ) ఆడిన ఎనిమిది మ్యాచ్లలో 32 ఓవర్లు బౌలింగ్ వేశాడు.20 సగటుతో మొత్తం 14 వికెట్లు తీశాడు.
గుజరాత్ జట్టు తరఫున ఈ ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేశాడు.ఆడిన నాలుగు మ్యాచ్లలో 13.12 సగటుతో మొత్తం 8 వికెట్లు తీసుకున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy