కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం.. మాజీ మంత్రి జూపల్లి

కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

నాలుగేళ్ల క్రితమే తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు జూపల్లి తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హతను కేసీఆర్ కోల్పోయారని విమర్శించారు.

తెలంగాణ అవినీతిలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు.అంతేకాకుండా రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడమే తమ లక్ష్యమని జూపల్లి స్పష్టం చేశారు.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

Latest Latest News - Telugu News