జూబ్లీహిల్స్ కేసుపై విచారణ.. నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్..!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డుప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్( Shakeel ) కుమారుడు రహెల్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు.

రెండు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాజోల్ చౌహన్ మృతిచెందగా మరో మహిళ గాయపడింది.

ప్రమాదం జరిగిన తరువాత కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.అయితే కారుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది షకీల్ కు చెందినట్లుగా గుర్తించారు.

ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కారులో షకీల్ కుమారుడు రహెల్( Raheel ) తో పాటు అతని స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే కారు తానే నడిపానంటూ ఆఫ్నాన్ పోలీసులకు లొంగిపోయాడు.

Advertisement

అయితే రహెల్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన పాత్రపై పోలీసులు మరోసారి దర్యాప్తు చేసేందుకు సిద్ధం అయ్యారు.ఈ క్రమంలోనే కేసులో రహెల్ ను నిందితుడిగా చేర్చారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement