జైలు సిబ్బందికి, తోటి ఖైదీలకు పెద్ద ఎత్తున పార్టీ..చార్లెస్ శోభరాజ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ

చార్లెస్ శోభరాజ్.వృధుడు అయిపోయాడు కాబట్టి నేపాల్ ప్రభుత్వం అతడిని వదిలెయ్యబోతుంది.

వదిలేసినా తర్వాత అతడిని 15 రోజులో అక్కడి నుంచి తన సొంత దేశం అంటూ లేకపోయినా ఫ్రాన్స్ కి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.శోభరాజ్ గురించి కొన్నేళ్లు ఎన్నో వందల ఆర్టికల్స్ మనం చూస్తున్న ఉన్నాం.

ఇప్పటికే అతడి పేరు పై నాలుగు డాక్యుమెంటరీలు, ఒక హిందీ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది.అయన తేనే పూసిన మాటలతో జనాలను దోచుకుంటూ, చంపుకుంటూ సీరియల్ కిల్లర్ గా అవతారం ఎత్తి పలుమార్లు జైలుకు వెళ్లిన సంఘటనలపై ఎన్నో స్టోరీ లు చూసాం.

అయితే చార్లెస్ శోభరాజ్ ఎవరినైనా మోసం చేయగలడు అని చెప్పడానికి ఒక సంఘటన ఉదాహరిస్తాను.చార్లెస్ తీహార్ జైలు లో శిక్ష అనుభవిస్తున్న క్రమం లో తనకు ఏం కావాలన్న కూడా అతడి తమ్ముడి తో తెప్పించుకుంటూ తెగ ఎంజాయ్ చేసాడు.

Advertisement
Intresting Story About Charles Shobharaj,Netflix, Web Series,Charles Sobhraj, Ch

టీవీ ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ శిక్ష కాలాన్ని గడిపాడు.ఇక శిక్ష కాలం ముగిసే సమయానికి థాయ్ నుంచి వారెంట్ సిద్ధంగా ఉంది.

అక్కడ ఒక్కసారి చిక్కితే మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉండటం తో అప్పుడు చార్లెస్ బుర్ర కు పని చెప్పాడు.ఎలాగూ విడుదల అవుతున్న కదా అని చెప్పి జైలు అధికారులకు, తన తోటి ఖైదులందరికి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు.

ఆ పార్టీ లో అందరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు.అయితే వారు మత్తు మందు కలిపి ఫుడ్, డ్రింక్స్ తీసుకుంటున్నామని తెలియక పార్టీ బాగా ఎంజాయ్ చేస్తూనే నిద్ర లోకి జారుకున్నారు.

Intresting Story About Charles Shobharaj,netflix, Web Series,charles Sobhraj, Ch

అందరు పడుకున్నాక దర్జా గా కొత్త పెళ్లి కొడుకులా జైలు నుంచి వెళ్ళిపోయాడు.అక్కడ నుంచి గోవా కి వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా మళ్లీ పట్టు బడి శిక్ష కాలాన్ని పొదిగించుకుని థాయ్ వారెంట్ కాలాన్ని వృధా చేసి ఆ వారెంట్ నుంచి తప్పించుకున్నాడు.ఆలా తన తెలివి తేటలు మొత్తం భార్యను మోసం చేయడానికి, డబ్బు దోచుకోవడానికి, జనాలను ఏమార్చడానికి వాడుకున్నాడు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

ఇప్పుడు పలు మార్లు హార్ట్ సర్జరీ లతో ముక్కి మూలుగుతున్న ఎవరు నమ్మకూడదు.ఎందుకంటే ముసలిది అయినా పాము కాటేయకుండా ఉంటుందా ?.

Advertisement

తాజా వార్తలు