పెద్దపల్లి బీజేపీలో రోడ్డెక్కిన అంతర్గత విభేదాలు..!!

పెద్దపల్లి బీజేపీలో( Peddapalli BJP ) అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి.

పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాస్( Srinivas ) నామినేషన్ ర్యాలీలో పార్టీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని సమాచారం.

అది కాస్తా ముదరడంతో ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.దీంతో నామినేషన్ ర్యాలీలో( Nomination Rally ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ముందుగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిపై( Sunil Reddy ) గుజ్జుల రామకృష్ణా రెడ్డి( Gujjula Ramakrishna Reddy ) వర్గం దాడికి ప్రయత్నించింది.అయితే వారి దాడిని సునీల్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గీయులకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు