ఐశ్వర్యారాయ్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ తన ప్రతిభతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

నీలి కళ్ల సుందరిగా పేరును సొంతం చేసుకున్న ఐశ్వర్యారాయ్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు కావడం గమనార్హం.బాల్యం నుంచి డాక్టర్ కావాలని అనుకున్న ఐశ్వర్యారాయ్ తర్వాత రోజుల్లో మోడలింగ్ పై దృష్టి పెట్టారు.ఐశ్వర్యా రాయ్ కు యాడ్స్ లో నటించే అవకాశం కూడా దక్కింది.1994 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటంను గెలుచుకున్న ఐశ్వర్యా రాయ్ పెప్సీ యాడ్ లో కూడా నటించారు.ప్రస్తుతం ఐష్ 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ అనే మూవీలో నటిస్తున్నారు.2007 సంవత్సరం ఐశ్వర్యా రాయ్ అభిషేక్ దంపతులకు వివాహం కాగా ఈ జంటకు ఆరాధ్య అనే కూతురు కూడా ఉన్నారు.2003 సంవత్సరంలో ఐష్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా నటించడం గమనార్హం.మన దేశం నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ నటి ఐశ్వర్యారాయ్ కాగా ఆమె నటనకు ఎన్నో అవార్డులు సైతం సొంతమయ్యాయి.మన దేశ ప్రభుత్వం 2009 సంవత్సరంలో ఐశ్వర్యకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది.2012 సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం ఐశ్వర్యారాయ్ కు ఆడ్రె డ్రెస్ ఆర్ట్స్ ఎట్ డ్రెస్ లెట్రెస్ అనే పురస్కారంతో సత్కరించింది.

ఐశ్వర్యా రాయ్ ఖాళీ సమయాలలో చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఎక్కువగా చదువుతారు.ఐశ్వర్యారాయ్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం కాగా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్స్ వచ్చినా ఐశ్వర్యా రాయ్ ఆ అవకాశాలను వదులుకున్నారు.ఐశ్వర్యారాయ్ ఫేవరెట్ హీరో రజినీకాంత్ కాగా రోబో మూవీలో వీళ్లిద్దరూ కలిసి నటించారు.

స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఐశ్వర్యారాయ్ ఆహార్యం ఆధారంగా బ్రిటన్ లో బార్బీ బొమ్మలను తయారు చేశారు.

Advertisement
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

తాజా వార్తలు