గోలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశిష్టతలు ఏమిటి?

మన సనాతన భారత దేశంలో ఎన్నో ఆలయాలకు పెట్టింది పేరు.

ఈ క్రమంలోనే మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఈ శివయ్య క్షేత్రాలు కనబడతాయి.వివిధ పేర్లతో స్వయంభూగా వెలసిన పుణ్య క్షేత్రాలు దర్శనం ఇవ్వగా మరికొన్ని దేవతల చేత, ఋషుల చేత ప్రతిష్ఠించబడి భక్తులకు దర్శనం ఇస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది శ్రీ గోలింగేశ్వర ఆలయం.మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ గోలింగేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో ఉంది.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్వామి వారు ఆలయ చరిత్ర ఏమిటి అనే విషయానికి వస్తే.పూర్వ కాలంలో బిరుదాంకుడు అనే రాజు కానేటి కోటలో వుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు.

Advertisement
Interesting Facts About Sri Golingeshwara Temple Sri Golingeshwara, Shivayya, An

ఇతని కాలంలో బిక్కవోలులో ఏకంగా 118 ఆలయాలు 118 బావులను నిర్మించాడని చెబుతారు.ఈ గ్రామంలో వెలిసిన గోలింగేశ్వర స్వామి బిరుదాంకపురంలో మంద బయలు భూమిలో కప్పబడి ఉండేది.ఈ క్రమంలోనే ఈ గ్రామంలోని రైతు ఆవు ప్రతిరోజు లింగాకారంలో ఉన్న పుట్టపై పాలు కార్చి వెళ్ళేది.

ఈ క్రమంలోనే ఆవుపాలు ఇవ్వకపోవడంతో ఆవును గమనిస్తూ రైతు కావలికి అద్భుతమైన సన్నివేశాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి ఈ విషయం తన యజమానికి చెప్పాడు.

Interesting Facts About Sri Golingeshwara Temple Sri Golingeshwara, Shivayya, An

ఈ క్రమంలోనే ఆ రైతు ఈ విషయాన్ని ఊర్లో వారందరికీ తెలుపగా ఊరి ప్రజలందరూ అక్కడికి వెళ్లి చూడటంతో ప్రతి రోజు ఆవు అక్కడ పాలు కార్చడం వల్ల అక్కడ పాలు కట్టిన చిన్న మడుగుని చూశారు.ఇది చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్తులు తప్పకుండా ఇక్కడ ఏదో దేవత విగ్రహం ఉంటుందని భావించారు.ఈ క్రమంలోనే సరైన ముహూర్తం చూసి రాజు తవ్వించగా ఆ ప్రదేశంలోపానమట్టంతో సహా లింగం బయట పడింది.

ఈ లింగానికి ఆలయం నిర్మించడానికి బిరుదాంక మహారాజు ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఆలయ నిర్మాణం చేపడుతున్న సమయంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడుతుంది.ఈ విధంగా రెండు విగ్రహాలు బయటపడటంతో ఈ ఆలయంలో పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలను ప్రతిష్టించి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఈ విధంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం మొదటిది పళనిలో దర్శనం ఇవ్వగారెండవది బిరుదాంకపురంగాలో దర్శనమిస్తుంది.ఈ విధంగా మొదట బయటపడిన లింగానికి గోలింగేశ్వరుడు అనే పేరు పెట్టడంతో ఇక్కడ స్వామివారు గోలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు