ఏపీలో కూడా దాడులకు అవకాశం నిఘా వర్గాల హెచ్చరిక..!!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ సైనిక నియామక విధానం వ్యతిరేకిస్తూ దేశంలో ఇప్పటికే బీహార్, ఉత్తరప్రదేశ్ తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దాడులకు పాల్పడుతూ భారీ విధ్వంసానికి తెర లేపటం తెలిసిందే.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం నుండి ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసానికి.

కొన్ని రైళ్లు దగ్ధమయ్యాయి.దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో వ్యక్తి కూడా మరణించడం జరిగింది.

Intelligence Agencies Warn Of Possible Attacks In Ap Too Agnipath Scheme, Secund

అయితే ఈ తరహా దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ, గుంటూరు రైల్వే స్టేషన్ లలో జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.దీంతో ఆర్పిఎఫ్ అధికారులతో విశాఖ సీపీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం జరిగింది.

ఎక్కడా కూడా పరిస్థితి చేజారి పోకుండా.అదనపు బలగాలు ముందుగానే మోహరించేలా.

Advertisement
Intelligence Agencies Warn Of Possible Attacks In AP Too Agnipath Scheme, Secund

ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క ఏపీ లో మాత్రమే కాదు అగ్నిపథ్ నిరసనలు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు