ఇంటెల్ సీటీవో , ఏఐ చీఫ్‌గా భారత సంతతి ఎగ్జిక్యూటివ్.. ఎవరీ సచిన్ కట్టి?

ప్రపంచంలోని టాప్ కంపెనీలకు సారథులుగా భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, పరాగ్ అగర్వాల్ ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దది.

రోజురోజుకు ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంది.తాజాగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ ఇంటెల్‌కు( Intel ) కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో), ఏఐ అధిపతిగా భారత సంతతికి చెందిన సాంకేతిక నిపుణుడు సచిన్ కట్టిని( Sachin Katti ) నియమించింది.

కొత్త సీఈవో లిప్ బు టాన్ ఆధ్వర్యంలో వ్యూహాత్మక నాయకత్వ మార్పులో భాగంగా ఇంటెల్ తన కొత్త సీటీవోని మార్పింది.తన ఆవిష్కరణ ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి, ఏఐ రోడ్ మ్యాప్‌ను వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది కీలక మలుపుగా కార్పోరేట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.2021 నుంచి 2025 వరకు ఇంటెల్ సీటీవోగా పనిచేసిన గ్రెగ్ లావెండర్ స్థానంలో కట్టి బాధ్యతలు స్వీకరిస్తారు.తన కొత్త హోదాలో సచిన్ కట్టి .ఇంటెల్ ఏఐ స్ట్రాటజీకి సారథ్యం వహిస్తారు.అలాగే కంపెనీ ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్‌ను పర్యవేక్షిస్తూ, ఇంటెల్ ల్యాబ్‌లను నడిపిస్తారు.

దీనికి అదనంగా స్టార్టప్‌లు, డెవలపర్ ఎకో సిస్టమ్‌లతో ఇంటెల్ ఇతర ఎంగేజ్‌మెంట్‌లు పర్యవేక్షిస్తాడు సచిన్.

Intel Appoints Indian-origin Executive Sachin Katti As Cto And Head Of Ai Detail
Advertisement
Intel Appoints Indian-origin Executive Sachin Katti As CTO And Head Of AI Detail

ఐఐటీ బాంబే( IIT Bombay ) పూర్వ విద్యార్ధి అయిన సచిన్ కట్టి.స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీలో 15 ఏళ్లకు పైగా ఫ్యాకల్టీ సభ్యుడిగానూ పనిచేశారు.ఇంటెల్ నెట్‌వర్కింగ్ , ఎడ్జ్ కంప్యూటింగ్ విభాగానికి సచిన్ నేతృత్వం వహించారు.

విద్య, వ్యవస్ధాపకత రెండింటిలొనూ సచిన్‌కు అపార అనుభవం ఉంది.మొబైల్ నెట్‌వర్క్‌లకు రియల్ టైమ్ ఏఐని( Real Time AI ) వర్తింపజేయడంపై దృష్టి సారించడంలో భాగంగా ‘ఉహానా’ను స్ధాపించారు సచిన్.

దీనిని తర్వాతి రోజుల్లో వీఎం వేర్‌ కొనుగోలు చేసింది.

Intel Appoints Indian-origin Executive Sachin Katti As Cto And Head Of Ai Detail

గతంలో ఏఐకి సంబందించి ఇంటెల్ బిజినెస్‌లో పొందుపరచబడ్డాయి.ఈ మార్పు ఏఐని వెలుగులోకి తీసుకొస్తుంది.ఈ ఏడాది మార్చిలో ఇంటెల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు .సెమీకండక్టర్ ఇండస్ట్రీలో అనుభవజ్ఞుడైన లిప్ బు టాన్ నియామకంతో నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.పరివర్తనాత్మక నాయకత్వ శైలిగా మారుపేరుగా నిలిచే టాన్.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

తాత్కాలిక కో సీఈవోలు డేవిడ్ జిన్సర్, మిచెల్ జాన్స్‌టన్ స్థానంలో నియమితులయ్యారు.ఇటీవల మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇంటెల్‌ను తిరిగి నిలబెట్టేందుకు గాను బు టాన్ సాహోసోపేతమై చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు