వైరల్: చదువమ్మా అని కూతురికి చెప్పాడు... తను ఏం చెప్పిందో తెలుసా?

సోషల్ మీడియాలో( Social media ) ప్రతి రోజు అనేక రకాల ఫన్నీ వీడియోలు పోస్టు అవుతూ ఉంటాయి.

అయితే అందులో కొన్ని మాత్రమే నెటిజన్ల మనసుని గెలుచుకుంటాయి.

తాజాగా ఓ చిన్నారి కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది చూసిన తర్వాత.

ప్రతిఒక్కరూ తమ బాల్యంలోకి వెళ్లక తప్పదు.చాలా సార్లు పిల్లలు తమ అమాయకత్వంతో ఎదుటివారికి నవ్వు తెప్పిస్తూ వుంటారు.

ఎందుకంటే ఆ చిన్నారుల్లో ( Children ) కల్లాకపటం ఉండదు.మనసులో ఏది ఉంటే.

Advertisement

అదే అనేస్తారు.చాలా సార్లు చిన్నారులు తమ అమాయకత్వంలో అవతల వ్యక్తులను నేరుగా కనెక్ట్ అవుతూ వుంటారు.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో తండ్రి ( Father ) తన కూతురితో చదువు గురించి మాట్లాడడం గమనించవచ్చు.తండ్రి అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి చాలా అమాయకంగా సమాధానాలు చెబుతోంది.తండ్రి తన కుమార్తెతో ( Daughter ) ఆమె చదువు గురించి మాట్లాడుతూ.

చదవడం, రాయడం వలన నాకు ఎమన్నా ఉపయోగమా? అని ప్రశ్నిస్తున్నాడు.దానికి వెంటనే ఆ చిన్నారి నీకే ప్రయోజనం అని చెప్పడం కొసమెరుపు.

ఎలా అని తండ్రి అడగగా.నేను చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయగానే తల్లిదండ్రులు డబ్బులు అన్నీ తీసుకుంటారని.

న్యూస్ రౌండప్ టాప్ 20

కనుక నేను చదువుకోవడం వలన నీకే ప్రయోజనం అంటూ అమాయకంగా చెప్పడం ఇపుడు నెటిజన్లను మెప్పిస్తోంది.

Advertisement

అంతేకాకుండా నేను చదువుకుని పెద్దయ్యాక డాక్టర్‌ని కాలేనని, అంతకుముందే దెబ్బలు తింటూ చనిపోతానని చెప్పి అమాయకంగా కన్నీళ్లు పెట్టుకుంది.యూనిక్‌మాత్‌సర్ అనే ఖాతాలో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా విశేషంగా చూస్తున్నారు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

కొందరు కామెంట్ చేస్తూ.అమ్మాయి నిజంగా చాలా అమాయకురాలు! అని రాయగా, ఈ అమ్మాయి మహా ముదురులాగా వుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొకరైతే ఆమె ఏది చెప్పిందో అది పూర్తిగా నిజం అని కామెంట్ చేయడం కొసమెరుపు.

తాజా వార్తలు