న‌వ చేత‌న‌లో ముంద‌డుగు వేస్తున్న భారత్ః ప్ర‌ధాని మోదీ

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్రమాన్ని పుర‌స్క‌రించుకుని.దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

దీనిలో భాగంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో జాతీయ జెండాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించారు.అనంత‌రం జాతిని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

ప్ర‌జాస్వామ్య దేశాల‌కు భార‌త్ మార్గ‌ద‌ర్శిగా నిలిచింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.ఒక‌ప్పుడు ఆకలికేకలతో విల‌విల‌లాడిన‌ భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.

వైజ్ఞానిక రంగంలో తన ముద్ర వేస్తుంద‌న్నారు.మ‌హాత్మునికి ఆశ‌యాల‌కు అనుగుణంగా పని చేస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

దేశాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.న‌వ‌చేత‌నతో ముంద‌డుగు వేస్తున్న భార‌త్ కు వ‌చ్చే 25 ఏళ్లు ఎంతో కీల‌క‌మ‌ని చెప్పారు.

స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు.సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు.

మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని వదిలేయాని సూచించారు.రాజకీయ సుస్థిరత వల్ల ప్రయోజనాలను ప్రపంచానికి భారత్‌ చూపిందని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement