స్పెషల్‌ స్టోరీ : పాక్‌ చెర నుండి వచ్చేసిన 'ఇండియాస్‌ డాటర్‌' ఉజ్మా ఇప్పుడేం చేస్తోంది?

ఇండియాకు చెందిన ఉజ్మా అహ్మద్‌ కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం మలేషియా వెళ్లింది.అక్కడ పాకిస్థాన్‌కు చెందిన తాహిర్‌ అలీ పరిచయం అయ్యాడు.

అప్పటికే పెళ్లి అయిన ఉజ్మాకు పాప కూడా ఉంది.అయితే భర్త నుండి దూరంగా ఉంటోంది.

మలేషియాలో తాహిర్‌ పరిచయం, ఆ తర్వాత స్నేహితుడుగా మారాడు.పాకిస్థాన్‌ వెళ్లిన తాహిర్‌ ఆ తర్వాత ఉజ్మాను కూడా పాక్‌ కు రమ్మని ఒత్తిడి చేశాడు.

ఒక్కసారి గెస్ట్‌ గా వచ్చి వెళ్లి పో అంటూ బలవంతం చేయడంతో సరేనని ఉజ్మా పాక్‌ వెళ్లింది.ఉజ్మా పాకిస్తాన్‌ వెళ్లిన తర్వాత తాహిర్‌ తన వక్ర బుద్దిని చూపించాడు.

Advertisement

అక్కడ ఆమెకు సంబంధించిన ఇమిగ్రేషన్‌ డాక్యుమెంట్స్‌ లాగేసుకుని, ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి తర్వాత చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు.

దాంతో ఉజ్మా పాక్‌ నుండి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.ఏదోలా పాక్‌లోకి ఇండియన్‌ హై కమీషన్‌ సాయం తీసుకుంది.

తన పరిస్థితిని వారికి తెలియజేసింది.విషయం భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌ వద్దకు చేరింది.

భారత యువతిని పంపించాలంటూ పాకిస్తాన్‌లో న్యాయపోరాటం చేయడం జరిగింది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సుష్మజీ ప్రయత్నాలు సఫలం అయ్యి 2017 మే 25న ఉజ్మా ఇండియాలో అడుగు పెట్టింది.ఆ సమయంలో ఉజ్మాను భారత మీడియా ఇండియాస్‌ డాటర్‌ అంటూ సంభోదిస్తూ పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేయడం జరిగింది.ఉజ్మా ఇండియాకు వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్‌ కూడా స్వయంగా ఒకానొక సందర్బంలో కలవడం జరిగింది.

Advertisement

ఉజ్మా ఇండియాకు వచ్చి రెండేళ్లయ్యింది.ఇప్పుడు ఉజ్మా ఏం చేస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రముఖ మీడియా సంస్థ ప్రయత్నించింది.

ప్రస్తుతం ఉజ్మా తన కూతురు ఫలక్‌ పేరుతో ఢిల్లీలో ఒక బ్యూటీ పార్లల్‌ ఏర్పాటు చేసింది.బ్యూటీ పార్లల్‌ బాగానే రన్‌ అవుతుందని, ప్రస్తుతం తాను కూతురుతో సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉజ్మా జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ చిత్ర నిర్మాత ఉజ్మాకు పెద్ద మొత్తంలో రాయల్టీ చెల్లిస్తానంటూ మాట ఇచ్చాడట.మొత్తానికి పాక్‌ అనే నరకం నుండి బయట పడ్డ తర్వాత ఇండియాకు రావడంతో ఆమెకు స్వర్గంలోకి వచ్చినట్లుగా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

తాజా వార్తలు