ఇంగ్లాండ్‌లో ఇండియన్స్ నిరసనలు ఎందుకు చేస్తున్నారు..??

ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో చాలా మంది బ్రిటీష్ ఇండియన్లు బీబీసీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.వారు యూకేలోని 5 నగరాల్లో ఈ నిరసనలు చేపట్టారు.

బీబీసీ కోసం ప్రజా నిధులను నిలిపివేయాలని కోరారు.బీబీసీ మోదీపై చేసిన డాక్యుమెంటరీని పక్షపాతంగా, అన్యాయమైన రిపోర్టింగ్‌గా వారు పేర్కొంటూ ఫైర్ అయ్యారు.

డాక్యుమెంటరీ ఏకపక్షంగా ఉందని, భారత్‌, బ్రిటన్‌లలో శాంతియుతంగా జీవిస్తున్న ప్రజలను విడగొట్టేలా ప్రయత్నం చేస్తోందని డాక్టర్ వివేక్ కౌల్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీపై విచారణ జరపాలని హిందువులు కోరుతున్నారు.ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని నమ్ముతున్నారు.కాగా బీబీసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన శాంతియుతంగా జరిగింది, కానీ బర్మింగ్‌హామ్‌లో, ఒక ముస్లిం యువకుడు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు.

Advertisement

కానీ అది ఎలాంటి హింసాత్మక ఘటనలకు దారి తీయలేదు.లీసెస్టర్‌లో హిందువులపై జరిగిన దాడి తర్వాత ఈ డాక్యుమెంటరీ మరింత ద్వేషం, సంఘర్షణకు కారణమవుతుందని బ్రిటిష్ ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన చెందుతోంది.

మరోవైపు 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.ఇకపోతే బీబీసీ 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది.1926 సార్వత్రిక సమ్మె కవరేజీకి మంచి ఆదరణ లభించే వరకు ఇది పోరాడింది.తరువాత బీబీసీ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే పబ్లిక్ ఆర్గనైజేషన్‌గా మార్చబడింది.

అయితే బీబీసీ దాని కార్యకలాపాలలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంటుంది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు