కమల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

కమల్ హాసన్,( Kamal Haasan ) తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఇటీవల తెరకెక్కిన సినిమా భారతీయుడు 2.

( Bharateeyudu 2 ) 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా సొంతం చేసుకుంది.

గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అభిమానులకు కూడా తీవ్ర నిరాశ ఎదురయింది.

Advertisement

అయితే ఈ సినిమాను డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్( Netflix ) దాదాపుగా 120 కోట్లకు కొనుగోలు చేసింది.తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు 2 వివాదం ముగిసిందని సమాచారం.

ఇక మరోవైపు ఇండియన్ 2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే.

దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం, థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ 2 ను( Indian 2 ) ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ.దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా ఎప్పుడో ఓటీటీ లోకి రావాలి కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

కోమాలోకి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు సావిత్రి చెప్పిన మాటలు
Advertisement

తాజా వార్తలు