జర్మనీలో పెరుగుతున్న భారత వర్కర్లు.. గణాంకాలు చూస్తే!!

జర్మనీలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (STEM) రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది.

అయితే, యూరోపియన్ యూనియన్ లోపల, వెలుపల ఉన్న విదేశీ కార్మికులు ఈ కొరతను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

గత దశాబ్దంలో జర్మనీలో విదేశీ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఇది కొరతకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.

కాగా ఇమ్మిగ్రేషన్ సహాయంతో, భారతదేశం, టర్కీ, ఇటలీ, చైనా నుంచి స్టెమ్ కార్మికుల సంఖ్య బాగా పెరిగింది.

Indian Workers Are Increasing In German . If You Look At The Statistics Skille

2012 మొదటి త్రైమాసికం నుంచి 2022 రెండవ త్రైమాసికం వరకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (స్టెమ్) ఉద్యోగాలలో పనిచేస్తున్న జర్మన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల సంఖ్య 35.6% పెరిగింది.జర్మన్ పాస్‌పోర్ట్ లేని కార్మికుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.171.7% పెరుగుదలతో కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుపుతోంది.స్టెమ్ ఉద్యోగాలలో ఎక్కువ మంది విదేశీ కార్మికులు భారతదేశం, టర్కీ, ఇటలీ, చైనా నుంచి వచ్చారు.

Advertisement
Indian Workers Are Increasing In German . If You Look At The Statistics!! Skille

జర్మనీలో స్టెమ్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య గత దశాబ్దంలో 3,700 నుంచి 25,000కి చేరుకుంది.

Indian Workers Are Increasing In German . If You Look At The Statistics Skille

ఇదే సమయంలో స్టెమ్ ఉద్యోగాలలో యూరోపియన్ యూనియన్ కాని విదేశీ కార్మికుల ఉపాధి 267.7% పెరిగి 1,11,400కి చేరుకుంది.యూరోపియన్ యూనియన్ విదేశీ కార్మికుల ఉపాధి 86.1% పెరిగి 72,600 మంది కార్మికులకు చేరుకుంది.ఈ రకమైన వలసలు ఇటీవలి సంవత్సరాలలో జర్మనీ శ్రేయస్సుకు పెద్ద సహకారం అందించాయి.

జర్మనీ ప్రస్తుతం నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది, ముఖ్యంగా ఐటీలో స్టెమ్ విద్యార్థుల సంఖ్య 2016లో 1,98,000 నుంచి 2021లో 1,72,000కి తగ్గింది.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు