వైరల్: అలల తాకిడికి పడవ ఎలా బోల్తా పడుతుందో చూడండి!

సముద్రం దూరం నుండి ఎంత అందంగా కనబడుతుందో దగ్గరినుండి అంత భయానకంగా ఉంటుంది.ఇక అలాంటిది నడి సంద్రంలో పడవ ప్రయాణమంటే మాటలు కాదు.

 Viral: Watch How A Boat Capsizes Due To Waves! Boat, River, Viral News, Viral V-TeluguStop.com

ఎందుకంటే సముద్రంలో ఎప్పుడు తుఫాన్ వస్తుందో ఎవరూ ఊహించలేరు.ముఖ్యంగా సముద్రంలో వచ్చే అలలను మనం ముందుగా ఊహించడం కష్టం.

తాజాగా సముద్రంలో ఓ పడవ భారీ అలకు అటుఇటు వుయ్యాలలాగా ఊగిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అవును, USలోని పసిఫిక్ తీరంలో భారీ అలకు పడవ బోల్తా పడిన వీడియో ఇపుడు ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తోంది.

ఓ పెద్ద కెరటం పడవను బోల్తా పడేయగా కోస్ట్‌గార్డు ఓ వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉందని ఓ మీడియా నివేదించింది.ఒక రెస్క్యూ చేసే వ్యక్తి పడవను చేరుకోవడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.అతను వించ్ కేబుల్‌ను ఉపయోగించి నీటిలోకి దూకిననట్లు కనబడుతోంది.అయితే అతను పడవను సమీపించగానే భారీ అలకు ఓడను బోల్తా కొట్టింది.దీంతో అందులో ఉన్న వారు నీటిలో పడిపోయారు.రెస్క్యూ స్విమ్మర్ బలమైన అలలతో పోరాడుతూ నీటిలో మునిగిన వారిని రక్షించే యత్నం చేశారు.

సదరు వీడియోను హెలికాప్టర్ నుంచి చిత్రీకరించినట్లుగా కనబడుతోంది.USCG పసిఫిక్ నార్త్‌వెస్ట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా ఈ తంతు వెలుగు చూసింది.” సమయానికి చేరుకోవడం గురించి మాట్లాడండి! కొలంబియా నది ముఖద్వారం వద్ద శిక్షణా మిషన్లో వున్నపుడు, 2 కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రూలు మాస్టర్ ఆఫ్ ది పి/సి శాండ్‌పైపర్ నుండి #మేడే ప్రసారాన్ని అందుకోవడం జరిగింది” అని దానికి క్యాప్షన్ కూడా ఇవ్వడం ఇక్కడ చూడొచ్చు.“STA కేప్ డిసప్పాయింట్‌మెంట్ నుంచి చిమోటారు లైఫ్ బోట్‌లను స్టార్ట్ చేసారు.అయితే సెక్టార్ కొలంబియా నది వద్ద భారీగా అలలతాకిడి ఉండడంతో వాచ్‌స్టాండర్‌లకు సమాచారం ఇవ్వడం జరిగింది.”అని అక్కడ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube