Indian students : అమెరికాలో భారత విద్యార్ధుల మరణాలు .. మానసిక ఆరోగ్యంపై నిపుణుల ఆందోళన

గడిచిన రెండు నెలల సమయంలో అమెరికా( America )లో ఏడుగురు భారతీయ విద్యార్ధులు మరణించడం భారత్ , అమెరికాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

వాటిని ఎలా నిరోధించవచ్చనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ మరణాలు ఒకదానితో మరొకటి సంబంధం లేనివి అయినప్పటికీ .విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన నెలకొందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ మరణాల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ చట్టసభ సభ్యుడు పిల్లలకు మానసిక ఆరోగ్యం( mental health )పై సపోర్ట్‌ను అందించాలని పిలుపునిచ్చారు.

కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుంచి వచ్చిన అధ్యయనం ప్రకారం.ఏదైనా మానసిక అనారోగ్యం వున్న పెద్దవారిలో 2021లో 52 శాతం మంది శ్వేతజాతీయులతో పోలిస్తే కేవలం 25 శాతం ఆసియా పెద్దలు మాత్రమే మానసిక ఆరోగ్య సేవలను అందుకున్నారని నివేదించారు.

భారత సంతతికి చెందిన విద్యార్ధులు అధిక విజయాలు సాధించిన వ్యక్తులని.వారిపై ఆయా కుటుంబాల్లో ఎన్నో అంచనాలు వుంటాయని ఇల్లినాయిస్ డెమొక్రాట్, భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamoorthi ) ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.కుటుంబ సభ్యులు తమపై పెట్టుకున్న అంచనాలను ఎదుర్కోవడమే కాకుండా కొత్త వాతావరణంలో వుండటం వల్ల విద్యార్ధుల్లో ఒత్తిడి( Stress ) పెరుగుతుందని రాజా కృష్ణమూర్తి చెప్పారు.

Advertisement

వరుస మరణాలతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

జనవరిలో 19 ఏళ్ల నీల్ ఆచార్య( Neel Acharya ) పర్డ్యూ యూనివర్సిటీ క్యాంపస్‌లో శవమై కనిపించాడు.ఊపిరాడకపోవడం వల్లే ఆచార్య మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.శీతల ఉష్ణోగ్రతలు, ఆల్కహాల్ మత్తు కూడా అతని మరణంతో ముడిపడి వున్నాయని కరోనర్ కార్యాలయం తెలిపింది.

కానీ తర్వాత కొన్ని రోజులకే నీల్ ఆచార్య ఆత్మహత్య చేసుకున్నట్లు కరోనర్ కార్యాలయం వెల్లడించింది.మరో ఘటనలో కనెక్టికట్‌లో ఇద్దరు భారత సంతతికి చెందిన విద్యార్ధులు 22 ఏళ్ల దినేష్ గట్టు( Dinesh Gattu ) .21 ఏళ్ల సాయి రకోటి మృతదేహాలు జనవరి 15న వారి అపార్ట్‌మెంట్‌లో కనిపించాయని పోలీసులు వెల్లడించారు.మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ప్రకారం .సేక్రేడ్ హార్ట్ యూనివర్సిటీ విద్యార్ధులు ప్రమాదవశాత్తూ ఫెంటానిల్ అధిక మోతుదుతో తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.జార్జియా గ్యాస్ స్టేషన్‌లో వివేక్ సైనీ అనే 25 ఏళ్ల భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్ధినిని కొట్టి చంపబడ్డాడు.

నిందితుడు జూలియన్ ఫాల్క్‌నర్ (53)ని అదుపులోకి తీసుకున్నారు .

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు