ఇజ్రాయెల్ - హమాస్ వార్ : కాల్పుల విరమణ ఓటమితో సమానమన్న నిక్కీ హేలీ

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం( Israel-Hamas War ) అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల - వ్యతిరేక నిరసనలతో గత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతోంది.

ఇలాంటి ఉద్రిక్త పరిస్ధితుల వేళ భారత సంతతికి చెందిన అమెరికా నేత, ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ( Nikki Haley ) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.లెబనాన్ ఉత్తర సరిహద్దు సమీపంలోని ఓ ప్రాంతంలో పర్యటించిన ఆమె.ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మోర్టార్ షెల్‌పై "Finish Them" అని రాశారు.దీనిపై పాలస్తీనా మద్ధతుదారులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

అయినప్పటికీ నిక్కీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టం చేశారు.ఇజ్రాయెల్‌కు( Israel ) మద్ధతు ఇచ్చినందుకు అమెరికా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.

ది న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురించబడిన కథనంలో మాత్రం హేలీ.జో బైడెన్ పరిపాలనపై మండిపడ్డారు.

Advertisement

అక్టోబర్ 7న హమాస్ చేసిన పనిని వారు పూర్తిగా మర్చిపోయారని ఆమె వ్యాఖ్యానించారు.ఇటీవలి తన లెబనాన్ పర్యటన సందర్భంగా తీవ్రవాద సంస్థ హమాస్‌పై( Hamas ) ఇజ్రాయెల్ ఎదురుదాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

గాజాలో ఇజ్రాయెల్ తన పనిని పూర్తి చేయడం, హమాస్‌ను ఓడించి , ప్రతి బందీని వారి కుటుంబాలకు అప్పగించడం కీలకమన్నారు.

ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిరోధించడానికి ప్రయత్నించినందుకు గాను జో బైడెన్,( Joe Biden ) కాంగ్రెస్ సభ్యులపై నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాల్పుల విరమణ( Ceasefire ) అనే డిమాండ్‌ను చెత్తగా పేర్కోవడంతో పాటు కాల్పుల విరమణ అనేది ఓటమితో సమానమని అభివర్ణించింది.ఇది ఉగ్రవాదులకు తమ మిషన్‌ను పూర్తి చేయడానికి సమయాన్ని, వనరులను ఇస్తుందని.

ఈ చర్య ఇజ్రాయెల్‌ను పూర్తిగా నాశనం చేస్తుందని నిక్కీ హేలీ తేల్చిచెప్పారు.యుద్ధాన్ని విరమించుకోవాలని ఇజ్రాయెల్‌కు సూచించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ).

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ (ఐసీజే)లను సైతం నిక్కీ హేలీ విమర్శించారు.

Advertisement

ఇకపోతే.కొద్దిరోజుల క్రితం రఫాపై( Rafah ) ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడికి దిగింది.ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా 60 మందికి గాయాలయ్యాయి.

మరణించిన వారిలో మహిళలు, చిన్నారులే సగం మంది వరకు వున్నారు.దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది.దీంతో ఉత్తర, మధ్య గాజాలకు చెందిన ప్రజలు కట్టుబట్టలతో తరలివచ్చి గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు.

అలాంటి ప్రదేశంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది.

తాజా వార్తలు