జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )రాజీనామాతో కెనడాలో ప్రధాని పదవికి ఎన్నికల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.ఇందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.
భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య( MP Chandra Arya ) కూడా ప్రధాని పదవి రేసులో నిలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసిన ఆయన కెనడా పార్లమెంట్‌లో తన మాతృభాష కన్నడంలో ప్రసంగించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
తరతరాలుగా చూడని నిర్మాణాత్మక సమస్యలను మనం ఎదుర్కొంటున్నామని.వాటిని పరిష్కరించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్ర చెప్పారు.
కెనడియన్లకు( Canadians ) ఏది ఉత్తమమో దాని కోసం తాను శ్రమిస్తానని.నా పిల్లల కోసం సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.
లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని చంద్ర ఆర్య హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని సిరలో జన్మించిన ఆయన ధార్వాడ్‌లోని కౌశాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో( Kausali Institute of Management Studies, Dharwad ) ఎంబీఏ పూర్తి చేశారు.2006లో ఆయన కెనడాకు వలస వెళ్లారు.తొలుత ఇండో కెనడా ఒట్టావా బిజినెస్ ఛాంబర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్ర ఆర్య అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2015 కెనడా ఫెడరల్ ఎన్నికల్లో నెపియన్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.తొలి నుంచి కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు చంద్ర ఆర్య.
ఈ క్రమంలో ఆయన పలుమార్లు ఖలిస్తాన్ మద్ధతుదారులకు టార్గెట్ అయ్యారు కూడా.ఇప్పటికే భారత సంతతికి చెందిన అనితా ఆనంద్( Anita Anand ) కూడా కెనడా ప్రధాని రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు చంద్ర ఆర్య కూడా పోటీలో నిలవడంతో ఉత్కంఠ నెలకొంది.
కాగా.కెనడా ప్రధాని ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.అంతేకాదు తాను పార్లమెంట్‌కు తిరిగి ఎన్నిక కావాలనే ఉద్దేశం లేదని తెలిపారు.
తాను తిరిగి బోధనా వృత్తి వైపు వెళ్తానని అనిత స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy