ట్విట్టర్‌కు షాకిచ్చిన భారత సంతతి టాప్ ఎగ్జిక్యూటివ్

భారత సంతతికి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ సందీప్ పాండే ట్విట్టర్‌కి షాకిచ్చారు.ఆ సంస్థతో దాదాపు పదేళ్ల బంధాన్ని తెంచుకుని మెటా (ఫేస్‌బుక్)లో చేరనున్నారు.

సందీప్ పాండే ట్విట్టర్‌లో ఇంజనీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ది ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.2012 నుంచి ట్విట్టర్‌లో పనిచేస్తోన్న పాండే.మెటాలో చేరిన తర్వాత కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ టీమ్‌లలో పనిచేస్తారు.

ఇంతకుముందు ట్విట్టర్‌లో సెంట్రల్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ , డేటా ఫ్లాట్‌ఫారమ్‌కు నాయకత్వం వహించారు.కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్న సందీప్ పాండే.ఐబీఎం ఇండియా రీసెర్చ్ ల్యాబ్, గూగుల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు.

యాహూలోనూ పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేశారు.తర్వాత ట్విట్టర్‌లో స్టాఫ్ ఇంజనీర్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

సందీప్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.ఇంజనీరింగ్‌‌ విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా, రెవెన్యూ సైన్స్‌కి హెడ్‌గా, బ్రాండ్, వీడియో టీమ్‌కి నాయకత్వం వహించారు.

ఇకపోతే.టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను టేకోవర్ చేస్తానని ప్రకటించిన తర్వాత ఆ సంస్థలో కీలక హోదాల్లో వున్న ఎగ్జిక్యూటివ్‌లు ఒక్కొక్కరిగా వైదొలుగుతోన్న సంగతి తెలిసిందే.ఇందులో కత్రినా లేన్ ( ట్విట్టర్ సర్వీస్ మాజీ వైఎస్ ప్రెసిడెంట్ ), ఇల్యా బ్రౌన్ (హెల్త్ వైస్‌ ప్రెసిడెంట్), మాక్స్ ష్మీజర్ (డేటా సైన్స్ హెడ్)‌లు వున్నారు.

అంతేకాదు.ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సైతం ప్రొడక్ట్ లీడర్ కేవోన్ బేక్‌పూర్, రెవెన్యూ ప్రొడక్ట్ హెడ్ బ్రూస్ ఫాల్క్‌ను ఈ ఏడాది మేలో తొలగించిన సంగతి తెలిసిందే.

అలాగే ట్విట్టర్‌‌లో నియామకాలు కూడా స్తంభించిపోవడంతో పాటు చాలా ప్రాంతాల్లో ఖర్చును కూడా తగ్గించాలని సంస్థ నిర్ణయించింది.ఇటీవల తన టాలెంట్ అక్విజిషన్ టీమ్ నుంచి 30 శాతం మంది ఉద్యోగులను ట్విట్టర్ తొలగించిన సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు