పనిచేసే షాపుకే కన్నం: లక్షలాది రూపాయల వాచ్‌లు దొంగతనం, భారతీయుడు అరెస్ట్

పనిచేసే షాపుకే కన్నం వేసిన ఓ భారతీయుడిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నగరంలోని గోల్డ్ సూక్‌లో ఉన్న వాచ్‌లు, ఆభరణాల సంస్థలో 26 ఏళ్ల భారతీయుడు పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో 86 వాచ్‌లను అతను దొంగతనం చేశాడు.వీటి విలువ 2 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

దీనిని గుర్తించిన షాపు యజమాని జనవరి 6న నైఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తనకు గోల్డ్ సూక్‌ ప్రాంతంలో వాచ్‌లు, ఆభరణాలను విక్రయించే షాపులు ఉన్నాయని, గతేడాది డిసెంబర్ 25న తాను ఓ షాపులో ఉన్నానని విచారణ సందర్భంగా ఆ దుకాణదారు ప్రాసిక్యూషన్‌కు వివరించారు.

ఆ సమయంలో తన దగ్గర పనిచేసే భారతీయ సేల్స్‌మెన్ చెత్త బుట్టలో ఓ వాచ్‌ను చూసి తన దృష్టికి తీసుకొచ్చాడని ఆయన తెలిపారు.దాని విలువ 30,000 వేల దినార్‌లు ఉంటుందని యజమాని చెప్పారు.

Advertisement

అయితే ఈ వాచ్ అనుకోకుండా చెత్త బుట్టలో పడిపోయి ఉంటుందని తేలిగ్గా తీసుకున్నానని దుకాణదారు వెల్లడించారు.ఈ సంఘటన తర్వాత ఓ రోజు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తుండగా అసలు విషయం బయటపడిందన్నారు.

ఆ సమయంలో ఓ క్లీనర్ వాచ్ దొంగతనంగా తీసుకుంటున్నట్లు కనిపించిందని యజమాని చెప్పారు.ముందుగా వాచ్‌ను ఒక పెట్టేలో ఉంచి దానిని చెత్త బుట్టలో పడవేసేవాడని, ఆ తర్వాత దానిని దొంగిలించేవాడని తెలిసింది.

దీనిపై తాను సదరు క్లీనర్‌ను నిలదీయగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే వాచ్‌లను దొంగతనం చేసినట్లు అతను నేరాన్ని ఒప్పుకున్నట్లు దుకాణదారు పేర్కొన్నారు.అదే సమయంలో తన షాపుకు సమీపంలోని ఇతర దుకాణాల్లో ఎలాంటి దొంగతనం చేయలేదని ఆ క్లీనర్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రాసిక్యూషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

అయితే అతనిని తాము నమ్మలేదని, వెంటనే భారత్‌‌లో ఉంటున్న అతని సోదరుడిని సంప్రదించి దుబాయ్‌కి రావాల్సిందిగా చెప్పామన్నారు.దుకాణదారు నిందితుడిని అతని సోదరుని సమక్షంలో మరోసారి ప్రశ్నించగా.తాను 2,50,000, 2,70,000 విలువైనన రెండు వాచ్‌లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

దొంగిలించిన ఒక్కొక్క దానిని 10,000 డాలర్లకు ఒక పాకిస్తానీ వ్యక్తికి విక్రయించినట్లు తెలిపాడు.అయితే ఒక వాచ్‌కు సంబంధించిన డబ్బు ఇంకా రావాల్సి ఉందని క్లీనర్ తెలిపాడు.

Advertisement

అక్కడికి దగ్గరలోని ఓ కేఫ్‌లో పాకిస్తానీ తనను కలిసేవాడని చెప్పాడు.దొంగిలించిన గడియారాలను తీసుకున్నందుకు గాను ఇద్దరు పాక్ జాతీయులపైనా కేసు నమోదు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.

తాజా వార్తలు