తెలుగోడి నూతన టెక్నాలజీతో ఇకపై సినిమా పైరసీకి చెక్ పడినట్లేనా?

సినీ పరిశ్రమను గత కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ‘పైరసీ’(Piracy).

ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా, పైరసీ మోసగాళ్లు కొత్త మార్గాలను వెతుక్కుని సినిమాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు.

దీని వల్ల కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు, సినిమాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు (Distributors)భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalle , Andhra Pradesh)జిల్లాకు చెందిన యువ ఇంజినీర్ వినోద్ కుమార్ ‘పైరసీ సెక్యూర్డ్ బోర్డ్’ అనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి, పైరసీ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు వేశారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటర్‌మార్క్ విధానాన్ని మించే ఈ టెక్నాలజీ అత్యాధునికమైనదిగా పేర్కొంటున్నారు.పైరసీని అరికట్టే క్రమంలో అమెరికా, జపాన్ (America, Japan)వంటి దేశాలు ఉపయోగిస్తున్న టెక్నాలజీతో పోటీ పడుతూ వినోద్ కుమార్ కనిపెట్టిన టెక్నాలజీ పేటెంట్ హక్కులు దక్కించుకోవడం విశేషం.

ఇది పూర్తిగా హార్డ్‌వేర్ ఆధారిత టెక్నాలజీ.ఈ టెక్నాలజీని ధియేటర్లలో అమర్చుకుంటే, సెల్‌ఫోన్ లేదా అత్యాధునిక కెమెరాలతో సినిమా రికార్డ్ చేయడం అసాధ్యం అవుతుంది.

Advertisement
Is It Possible That Telugu Movie Piracy Will Now Be Checked With New Technology,

ఎందుకంటే, రికార్డ్ చేసిన వీడియోలో చుట్టూ ఉన్న శబ్దాలే వినిపిస్తాయి, తెల్లటి తెర మాత్రమే కనిపిస్తుంది కానీ, సినిమా ఫుటేజ్ రికార్డ్ కాదు.

Is It Possible That Telugu Movie Piracy Will Now Be Checked With New Technology,

వినోద్ కుమార్ రూపొందించిన ఈ టెక్నాలజీని వివిధ దశల్లో పరీక్షించిన అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘బెల్‌కామ్ టెక్నాలజీ’ దీన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ టెక్నాలజీ పూర్తిగా పనికివస్తుందని, దీని ద్వారా పైరసీని సమర్థవంతంగా అరికట్టవచ్చని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.ఇకపోతే, వినోద్ కుమార్ గత 8 ఏళ్లుగా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేశారు.

పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమా ప్రొడక్షన్ సమయంలో పని చేసిన అనుభవంతో, సినీ పరిశ్రమలో ఉన్న పైరసీ సమస్యను బాగా అర్థం చేసుకుని, దీని కోసం ప్రత్యేకమైన సాంకేతిక పరిష్కారం కనుగొన్నారు.ఈ టెక్నాలజీని ధియేటర్లలో అమర్చడం కూడా చాలా సులభం.

తెర ముందు, తెర వెనుక కొన్ని ప్రత్యేకమైన హార్డ్‌వేర్ పరికరాలను అమర్చితే సరిపోతుంది.థియేటర్‌లో ఉన్న మౌలిక సదుపాయాల్లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు.

Is It Possible That Telugu Movie Piracy Will Now Be Checked With New Technology,
స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

వినోద్ కుమార్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీని ప్రతీ ధియేటర్‌లో అమలు చేస్తే, పైరసీ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.పైరసీ వల్ల కలిగే నష్టాన్ని గమనిస్తే.సినిమా నిర్మాతలు, థియేటర్ యజమానులు త్వరగా ఈ టెక్నాలజీని స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

ఇది నిజంగా అమలు అయితే, తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాలను పైరసీ నుంచి రక్షించడానికి ఇది కీలక భద్రతా టెక్నాలజీగా నిలుస్తుంది.త్వరలోనే ఈ టెక్నాలజీ విరివిగా ప్రాచుర్యం పొందాలని, పైరసీని పూర్తిగా అరికట్టాలని ఆశిద్దాం!.

తాజా వార్తలు