విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం

విశాఖపట్నంలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభమైంది.

ఈ మేరకు క్రూయిజ్ టెర్మినల్ ను కేంద్రమంత్రి సోనోవాల్ ప్రారంభించగా ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి సోనోవాల్ మాట్లాడుతూ ఏపీ సహజ వనరులు కలిగిన రాష్ట్రమన్నారు.సాగర మాల కార్యక్రమంలో భాగంగా పోర్టులను ఆధునీకరిస్తున్నామని తెలిపారు.రూ.5.6 లక్షల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్ చేపట్టామన్నారు.విశాఖలో కాలుష్యం నియంత్రించే ప్రక్రియ చేస్తున్నామన్న కేంద్రమంత్రి సోనోవాల్ విశాఖ పోర్టు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

విశాఖ పరిసరాల్లో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో టెర్మినల్ సేవలు అందిస్తుందని వెల్లడించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement