ఆ విష‌యంలో కేసీఆర్ ని ఫాలో అవుతున్న 'మ‌హా' నేత‌లు..!

ప‌క్క రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు.ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌డం స‌హ‌జం.

అలాగే ప‌లు విష‌యాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఫాలో అవుతుంటాయి.ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఓ కార్య‌క్ర‌మాన్ని కాపీ కొట్టింది.75వ సాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తెలంగాణ సీఎం కేసీఆర్ సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్ట‌ని ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.ఉదయం 11.30 గంటలకు తెలంగాణ మొత్తంగా స్తంభించేలా చేయటంతో పాటు.ట్రాఫిక్ తో పాటు మెట్రో రైలును సైతం ఆ సమయంలో నిలిపివేయటం.

ఒక నిమిషం పాటు జాతీయ గీతాలాపన చేయటం తెలిసిందే.హైదరాబాద్ మహానగరంతో పాటు యావత్ తెలంగాణలోనూ ఇదే తీరును ప్రదర్శించారు.

మ‌హారాష్ట్ర‌లో నేడు.దీనికి విశేష స్పందన వచ్చిన తీరును చూసిన మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్క‌డ కూడా పాటించ‌డానికి సిద్ద‌మైంది.

Advertisement

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సరిగ్గా ఇదే విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 11 గంటల వేళలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతూ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు.ఓవైపు తమ పార్టీకి అన్నీతానై అన్నట్లుగా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామూహిక జాతీయ గీతాలాపన ఐడియాను అక్క‌డ కూడా పాటించాల‌నుకోవ‌డం విశేషం.ఇక ఇప్ప‌టికే కేసీఆర్ చాలా సార్లు త‌మ ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతుంద‌ని అన‌డం తెలిసిందే.

ఇక దీంతో ఇప్పుడు ఇది కూడా కాపీకొట్టార‌ని అంటారేమో చూడాలి.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు