మా బంధంలో... దాపరికం లేదు...! హోదా వద్దని బాబు సంతకం చేశాడు...

2024లో కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం.హోదా సాధిస్తాం.

ఏలూరు వైసీపి ఎంపి కోటగిరి తిరుమల శ్రీవారిని ఎంపీ కోటగిరి శ్రీధర్ దర్శించుకున్నారు.ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయం వెలుపల ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రెండు సంవత్సరాల సుదీర్ఘ సంస్కృత, సంప్రదాయాలను భారతీయులు ఇప్పటికీ కొనసాగిస్తూ వుంటడం గర్వకారణం అన్నారు.ఇక బిజేపికి తమ వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలో సపోర్ట్ చేయడంలో ఎలాంటి ధాపరికం లేదన్నారు.

తద్వారా రాష్ట్రానికి సరైన సమయానికి అందాల్సిన నిధులు చేకూరుతున్నాయి అన్నారు.ప్రత్యేక హోదాపై జగన్ ఇప్పటికీ ఒకే మాటపై వున్నారు అనీ అవకాశం వచ్చిన ప్రతిసారీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు అని గుర్తుచేశారు.2024లో అయిన అవకాశం లభిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

Advertisement
మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు