కార్తీక మాసంలో తులసి కోటకు ఎప్పుడు పూజలు నిర్వహించాలి?

శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసాన్ని జరుపుకుంటారు.ఈ కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ, సోమవారాలలో శివకేశవులకు ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.

ఈ రోజులలో శివారాధన చేయడం ద్వారా ఆ పరమశివుని అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.ఎంతో పవిత్రమైన ఏకాదశి, ద్వాదశి తిధుల్లో మనం ఏం చేయాలో ఎలా పూజలను నిర్వహించాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి తిధుల్లో ఈ రెండు రోజులు విష్ణు సంబంధించినటువంటి పూజలను నిర్వహిస్తారు.అంతే కాకుండా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ ఏకాదశి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశి రోజు శయన పై నిద్రించిన విష్ణు భగవానుడు ఈ ఏకాదశి రోజున నిద్రలేవడం వల్ల ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారు.

Advertisement

అదేవిధంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు.ఏకాదశి రోజున విష్ణు భగవానుడు క్షీరసాగరమధనం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ఇష్టమైన తులసి బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు.అందుకోసమే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసికోటకు ఎంతో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.

కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయ సమయంలో తులసికోట ముందు దీపాలను వెలిగించి తులసికి, విష్ణుభగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి దానధర్మాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి చెట్టును పూజించడం వల్ల ఈతిబాధలు తొలగిపోయి సకల సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని వేద పండితులు తెలియజేస్తున్నారు.ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాలు, విష్ణుదేవాలయాలను దర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.

Advertisement

తాజా వార్తలు