ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో కచ్చితంగా ఈ నియమాలను పాటించలా..

హిందూ సనాతన ధర్మంలో దేవత అర్చనలలో మంగళహారతి ముఖ్యమైన భాగం అని దాదాపు అందరికీ తెలుసు.పూజ పూర్తయిన తర్వాత కర్పూరంతో మంగళ హారతి ఇస్తుంటారు.

హారతి లేకుండా చేసే పూజను అసంపూర్ణంగా చాలామంది భావిస్తారు.భగవంతునికి చేసే పూజ ఉపచారాలలో హారతి కూడా ఒకటి.

దీనినే నీరాజనం అని కూడా అంటారు.దీపం లేదా దీపాలు వెలిగించి పూజా విగ్రహానికి తిప్పుతూ హారతిని ఇస్తూ ఉంటారు.

భగవంతుని ఆరాధనలో భావవేషానికి చాలా ప్రాముఖ్యత ఉంది.కాబట్టి అత్యంత భక్తితో, విశ్వాసంతో చేసే హారతి ఆరాధనకు పూర్తి ఫలితాన్ని ఇస్తుందని చాలామంది నమ్ముతారు.

Advertisement
Importance And Significance Of Harathi To God,Harathi,God,Rituals,Devotional New

అంతేకాకుండా హారతి ఇవ్వడానికి కూడా కొన్ని పద్ధతులు నియమాలు కూడా ఉన్నాయి.వీటిని ఆజాగ్రత్త చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు రావచ్చు.

కనుక హారతిని ఇచ్చే సమయంలో ఏ ఏ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.దీనివల్ల దేవుడు త్వరగా ప్రసన్నుడు అవుతాడని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.

రోజు హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం సాయంత్రం రెండు పూటలా దేవునికి పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది భక్తుల విశ్వాసం.

హారతి ఇచ్చేముందు పూజా పళ్లెంలో పసుపు, కుంకుమతో స్వస్తిక్ వేసి అందులో పూలు సమర్పించి ఈ దీపం పెట్టాలని అసలు మర్చిపోకూడదు.హారతి ఇచ్చే ముందు, హారతి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా శంఖాన్ని ఉదాలి.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నిమ్మకాయ పచ్చడిని నిర్ల‌క్ష్యం చేస్తే..ఈ ప్ర‌యోజ‌నాల‌న్నీ కోల్పోతారు!

వీలైతే హారతి ఇచ్చే సమయంలో ఓం అక్షరం ఆకారంలో ప్లేటును తిప్పడానికి ప్రయత్నించడం మంచిది.

Importance And Significance Of Harathi To God,harathi,god,rituals,devotional New
Advertisement

హారతి ఇచ్చే సమయంలో హారతి ఇచ్చే ప్లేటును దేవుళ్ళ పాదాల వైపు నాలుగు సార్లు, నాభి వైపు రెండుసార్లు చివరగా ఒకసారి దేవుళ్ళ మొఖానికి చూపించాలి.ఈ మొత్తం ప్రక్రియను మొత్తం ఏడుసార్లు పూర్తి చేయడం మంచిది.హారతి ఇచ్చే సమయంలో ఇప్పటికే వెలిగించిన దీపాన్ని, కర్పూరాన్ని మళ్లీ వెలిగించకూడదని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి.

మట్టి దీపం ఉంటే దాన్ని స్థానంలో కొత్త దీపం, లోహంతో చేసిన దీపం అయితే దానిని కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించడం మంచిది.

తాజా వార్తలు