నేడే ఏరువాక పౌర్ణమి... ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసా?

జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది.ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు.

ఏరువాక పౌర్ణమి రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్దఎత్తున నిర్వహించుకుంటారు.ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం.అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

మొట్టమొదటిగా భూమి పూజ చేసి పొలాలలో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు.ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు.

Advertisement
Significance Of Eruvaka Pournami Festival, Eruvaka Pournami 2021, Jyeshta Pourn

జ్యేష్ఠ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు.ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఉదయమే నిద్రలేచి ఎద్దులను శుభ్రం చేసి ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి కాళ్ళకు గజ్జలు అలంకరించి ఎద్దులను ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు.

ఈ విధంగా అలంకరించిన ఎద్దులకు నాగలి కట్టి దీప దూప నైవేద్యాలతో పూజను నిర్వహిస్తారు.ఈ విధంగా ఎద్దులను అలంకరించి పొలాన్ని దున్నడానికి జ్యేష్ఠ నక్షత్రం ఎంతో మంచి నక్షత్రం అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

Significance Of Eruvaka Pournami Festival, Eruvaka Pournami 2021, Jyeshta Pourn

జ్యేష్ఠ పౌర్ణమినాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండటం వల్ల ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.పురాణాల ప్రకారం శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా చెబుతారు.అదేవిధంగా విష్ణు పురాణంలో కూడా సీతా యజ్ఞంగా ఏరువాకను వివరించింది.

సీత అంటే నాగలి అనే అర్థం వస్తుంది.రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగను సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు