రాయలసీమ జిల్లాలపై మాండూస్ తుపాను ప్రభావం

ఏపీలోని రాయలసీమ జిల్లాలపై మాండూస్ తుపాను ప్రభావం చూపిస్తోంది.తుపాను ప్రభావంతో తిరుపతి, తిరుమలలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తిరుపతి జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా తిరుపతి నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు.బాధితులు తక్షణ సాయం కోసం నెంబర్ 0877 2256766కు కాల్ చేయొచ్చని తెలిపారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Advertisement
The Foods That Help To Kill Breast Cancer Details

తాజా వార్తలు