కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచాడు... ఇలియానా పోస్ట్ వైరల్!

దేవదాసు సినిమా( Devdasu movie ) ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి ఇలియానా( ileana ) మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.

ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ అగ్రతారక ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఇలియానా అనంతరం కెరియర్ పరంగా వర్సెస ఫ్లాప్స్ తనని వెంటాడాయి.

దీంతో సినిమా అవకాశాలు లేక వచ్చిన సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో ఈమె ఎంతో నిరాశకు గురయ్యారు.దీంతో అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఇలియానా ప్రేమ పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.అయితే తన పెళ్లి గురించి ఎక్కడ చెప్పకపోయినా తాను మాత్రం ప్రెగ్నెంట్( Pregnant ) అనే విషయాన్ని అందరితో పంచుకున్నారు.ఇలా ఇలియానా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే ఈమెకు ఆగస్టు ఒకటవ తేదీ కొడుకు పుట్టిన విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు.

Advertisement

ఈ విధంగా ఇలియానా తన కొడుకుకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా తన కొడుకు అనారోగ్యానికి గురవడంతో ఈ బాధ భరించడం చాలా కష్టం అంటూ ఈమె తన కొడుకుతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.అయితే మరోసారి తన కొడుకు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.తన బిడ్డ అనారోగ్యానికి గురైనప్పుడు తన గుండె వేదనతో కొట్టుకుందని ఇలియానా తెలియచేశారు.

కన్నబిడ్డ ఆరోగ్యానికి గురైతే ఎలా భరించాలి అనే విషయాన్ని ఎవరు చెప్పరని ఈమె తెలిపారు.ప్రతి ఒక్క మహిళ తల్లి అయిన తర్వాతనే తను ఈ బాధను అర్థం చేసుకోగలరు.

అయితే నా జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నాకు ఎంతో అండగా నిలబడి ఆయన నా కన్నీళ్లను తుడిచాడు అంటూ తన ప్రియుడు గురించి చెప్పుకొచ్చారు.తను నా పక్కన ఉంటే ఏది కష్టం అనిపించదు అంటూ ఈ సందర్భంగా ఇలియానా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు