కడుపులో బిడ్డ తంతుంది నిద్ర రావడం లేదు.... ఇలియానా పోస్ట్ వైరల్!

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా(Ileana).

ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్ అనంతరం మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా(Pokiri Movie)లో హీరోయిన్ గా నటించిన ఎంతో సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఇలియానా అనంతరం అవకాశాలను కోల్పోయారు.ఇలా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అంటూ చేసినటువంటి ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇలా పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ ఈమెపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు.ఇకపోతే గత రెండు రోజుల క్రితం ఇలియానా తన బేబీ బంప్ (Baby Bump) ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎప్పటికప్పుడు అభిమానులతో తన ప్రెగ్నెన్సీ విషయాలను ప్రేగ్నెన్సీ(Pregency) సమయంలో తనకు కలిగే అనుభూతులను అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈమె మరోసారి సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.తన కడుపులో బిడ్డ తంతోందని.నిద్ర కూడా సరిగా రావడం లేదు అంటూ తన మాతృత్వపు అనుభూతులను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నేటిజన్స్ ఈమె ప్రెగ్నెన్సీ గురించి భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఇప్పటికైనా నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు